తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో పుట్టినా దాని అసలైన పుట్టిల్లు మాత్రం  క్రిష్ణా, గుంటూర్ జిల్లాలే. ఎక్కడ ఓడినా కూడా టీడీపీకి ఇక్కడ ఉనికి ఊపిరి ఉంటుంది. టీడీపీ చరిత్రలో ఎపుడూ కాపాడుకొచ్చిన జిల్లలుగా వీటిని చెప్పుకుంటారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనం భారీ ఎత్తున వీచింది. ఈ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ పునాదులను చాలా వరకూ కదిలించేసింది. ఇక  ఇపుడు అసలైన కధ మొదలైపోయింది.


తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాకు కంచుకోటలు. ఎందుకంటే ఆ పార్టీ సామాజికవర్గం ఇక్కడ అధికంగా ఉంటారు. పార్టీని తమ సొంతం అనుకుని పదిలంగా పొదువుకుంటారు. అటువంటి టీడీపీకి ఇపుడు పుట్టింట్లోనే  ఉనికి పోరాటం మొదలైపోయింది. క్రిష్ణా జిల్లా గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయడాన్ని ఆ విధంగా విశ్లేషించాలి. ఆయన టీడీపీ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా క్రిష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖుడు. అటువంటి వంశీ కన్న తల్లి లాంటి టీడీపీని వదులుకుంటున్నాడంటే ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చేసినట్లేనని అంటున్నారు. టీడీపీ విషయంలో ఇప్పటివరకూ వస్తున్న వార్తలు, వూహాగానాలు నిజం చేస్తూ వంశీ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారంతా.


టీడీపీని  నాయకత్వ  సంక్షోభం పట్టిపీడిస్తోందని వంశీ రాజీనామా తెలియచేస్తోంది. బాబు జమానా ముగిసిన చోట కొత్త నాయకత్వం లేకపోవడం, టీడీపీలో లోకేష్ కి పార్టీని లీడ్ చేసే సామర్ధ్యం లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సరే ఇపుడు వంశీ రాజీనామా చేశారు, ముందు ముందు మరెంతమంది పార్టీని వీడుతారో అన్న ఆందోళన పసుపు శిబిరంలో ఉంది. ఒకేసారి పది నుంచి పదిహేను మంది పార్టీని వదిలేస్తే ఇక టీడీపీ కోట కుప్పకూలిన‌ట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: