రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వల్లభనేని వంశీ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి  రాజీనామా వల్లభనేని వంశీ ప్రకటించారు. తాజా పరిస్థితుల్లో స్థానిక వైకాపా నేతల వల్ల నా అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టేవారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నావల్ల తరచు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానాని వంశీ చెప్పారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అయినప్పటికీ నేను ఎన్నికల్లో గెలుపొందాను. ఎన్నికల తర్వాత అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి.



రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు. అనుచరులపై కేసులు పెడుతున్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే నేను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని వల్లభనేని వంశీ లేఖలో రాసుకొచ్చారు. పైన చెప్పబడిన కారణాలతో శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు. అందుకే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానానాని అన్నారు. తన పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు కు లేఖ రాసిన వంశీ పేర్కొంన్నారు.  నాకు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చినందుకు  కృతజ్ఞతలు చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు పార్టీలో నాకు అప్పగించిన బాధ్యతలు అన్నీ నిర్వర్తించానాని చెప్పారు. ఇదే సమయంలో ప్రజలకు సేవ చేసినందుకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. 



గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వంశీ రాజీనామా చేసి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చాను. నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నాను. గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను వంశీ పంపారు. అంతేకాదు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో నిశితంగా వివరించారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: