జగన్మోహన్ రెడ్డితో గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీ భేటి అవటం తెలుగుదేశంపార్టీలో సంచలనంగా మారింది. జగన్ తో గన్నవరం భేటి అవుతారని ఎవరూ అనుకోను కూడా లేదు. అలాంటిది వాళ్ళిద్దరి భేటి వెనుక ఎవరున్నారనే విషయంలో టిడిపి నేతలు కూపీ లాగుతున్నారు.  సిఎం దగ్గరకు ఎంఎల్ఏను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తీసుకెళ్ళటం మరింత హాట్ టాపిక్ గా మారింది.

 

మంత్రి కొడాలినాని, ఎంఎల్ఏ వంశీ ఇద్దరు బాగా సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా సినీ నిర్మాతలు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళద్దరూ జూనియర్ ఎన్టీయార్ కు అత్యంత సన్నిహితులు కావటం. ఎంఎల్ఏ పార్టీ మారే విషయం మొన్నటి ఎన్నికలకు ముందు కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే ప్రచారం ప్రచారంగానే ఉండిపోయింది.

 

తాజా పరిణామాలతో టిడిపి నేతల మధ్య ఓ విషయం చర్చల్లో నలుగుతోంది. అదేమిటంటే సిఎం- ఎంఎల్ఏ భేటి వెనుక జూనియర్ ఎన్టీయార్ ఉన్నారని అనుకుంటున్నారు. ముందుగా టిడిపిలో నుండి కొడాలి నాని వైసిపిలో చేరారు. మొన్నటి ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీయార్ మావగారు నార్నే శ్రీనివాస్ వైసిపి కండువా కప్పుకున్నారు. తాజాగా వంశీ సిఎంతో భేటి అయ్యారు.

 

ఇవన్నీ చూస్తుంటే తన బంధువర్గం, సన్నిహితులను జూనియరే వైసిపిలో చేరేట్లుగా ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే గనుక నిజమైతే అందుకు బాధ్యులు చంద్రబాబునాయుడు, లోకేషే అవుతారనటంలో సందేహం లేదు. ఎందుకంటే టిడిపికి జూనియర్ కు ఏ విధమైన సంబంధం లేదన్నట్లుగా వాళ్ళు దూరం పెట్టేశారు.

 

చంద్రబాబు ఉన్నంత కాలం పార్టీ విషయాల్లో జూనియర్ వేలు పెట్టేందుకు లేదు. నిజానికి జూనియర్ ముందు లోకేష్ ఏ విషయంలోను నిలబడలేడని తెలిసినా చంద్రబాబు కొడుకు కాబట్టి టిడిపి నేతలు తప్పని పరిస్ధితుల్లో భరిస్తున్నారు.

 

మొన్నటి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా కార్యకర్తలు జిందాబాద్ లు కొట్టటంతో జూనియర్ పై ఇంకా మండుతోంది. ఈ పరిస్ధితులన్నింటినీ భేరీజు వేసుకున్న తర్వాతే అబ్బా, కొడుకులకు వ్యతిరేకంగా జూనియర్ తనదైన ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: