ఏంటో.. పండుగా అంటే అందరూ సంబరాలు చేసుకుంటారు.. స్వీట్స్ తో నోరు తీపి చేసుకుంటారు. ఇంట్లో లక్ష్మి పూజ చేసి ఇంటి ముందు టపాసులను కాల్చి సంబరాలు చేసుకుంటారు. కానీ అదే టపాసుల్లాంటి వార్తలు మనుషులపై పడితే తట్టుకోగలరా ? ఫుల్ దెబ్బలు తగిలి కుంగి కృశించిపోతారు.  

                            

ఇదే తరహాలో రెండు బాంబులు చంద్రబాబుపై పడ్డాయి. మొదట బాంబు పెద్ద శత్రువు వేస్తే.. రెండో బాంబు తన పార్టీ నాయకుడే వేశాడు. ఆ శత్రువు ఎవరు అని అనుకుంటున్నారా ? అదేనండి. రామ్ గోపాల్ వర్మ ఉదయాన్నే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ పెద్ద బాంబు పేల్చాడు కదా. 

                         

మొత్తం బాబు చేసిన అరాచకాన్ని, అతని కొడుకు తెలివి తేటల్ని అంత ఒకే ఒక్క నిమిషంలో ప్రజలందరికీ చూపించి.. చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు కదా. ఆ వీడియో ప్రస్తుతం అంత వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకనే చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. 

                  

ఆ షాక్ ఏంటంటే.. వల్లభనేని వంశి నేడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.. కేవలం అతని ఎమ్మెల్యే పదవికి మాత్రమే కాదు రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. దీంతో చంద్రబాబు తలపై బాంబు పడినట్టు అయ్యింది. ఏది ఏమైనా దీపావళి పండుగా రోజు చంద్రబాబుకు రామ్ గోపాల్ వర్మ, వల్లభనేని వంశి బాంబులు వేసి చుక్కలు చూపించారు. మరి ఈ బాంబుల నుండి ఎలా తేలుకుంటాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: