ఈ మద్య మనిషి తన మనుగడకు ముఖ్యంగా వాహన వినియోగం ఎక్కువగా చేస్తున్నారు.  ఎంతగా అంటే ఒక ఇంటికి కనీసం ఒకటీ రెండు వాహనాలు ఉండటం సర్వసాధారణం అయ్యింది.  అందులో ఎన్నో బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు వాహనాలు సులభవాయిదాల్లో ఇవ్వడంతో మద్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా కొంటున్నారు.  ఆ మద్య టూవిల్లర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండేది..కానీ ఇప్పుడు కార్లు సైతం ఈఎంఐ లో తీసుకోవడంతో వాహనాల వినియోగం మరీ ఎక్కువ అయ్యింది. 

దాంతో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  కొంత మంది వాహనాలు మైనర్లకు ఇవ్వడం..తెలిసీ తెలియన్ డ్రైవింగ్ తో వారి ప్రాణాలే కాదు..ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.  ఇక సినిమాల్లో కొన్ని సార్లు మనుషులే కాదు..జంతువులు కూడా బైక్ లు నడపడం చూపిస్తుంటారు. కాకపోతే అవి గ్రాఫిక్ తో క్రియేట్ చేసినవి..కానీ నిజంగా అందరూ చూస్తుండగా అది కూడా హైవేలో ఓ శునకం బైక్ డ్రైవింగ్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

కొన్నేళ్ల క్రితం ఓ శునకం బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెనక కూర్చోగా..ఓ శునకం చాలా స్టైలిష్ గా డ్రైవర్ చేస్తుంది.  కాకపోతే ఆ బైక్ కంట్రోలింగ్ వారు చేస్తున్నా..ఆ శునకం తాను బండి వీర లెవెల్లో నడుపుతున్నట్లు బిల్డప్ ఇస్తుంది.  ఈ వీడియోను జో బర్గ్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇంకేముంది కొద్ది గంటల్లోనే ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.  నిజంగా శునకం బైక్ నడపడం ఏంట్రా నాయనా..ఇలాగే జరిగితే రోడ్డు ప్రమాదాలు విచ్చలవిడిగా పెరిగిపోతాయని అంటున్నారు నెటిజన్లు. కుక్కకు హెల్మెట్ ఎక్కడుందని కొందరు, ఈ తరహా పిచ్చి పనులు చేయవద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: