లోకంలో మనుషులకు బ్రతికున్నప్పుడు ఎలాగో విలువలేదు, కనీసం మరణించాడు అని తెలిసాకైన అతని పట్ల దయతో ప్రవర్తించడం తెలియకుండా తయారవుతున్నారు. ఇకపోతే రోడ్డుపైన వాహనాలు నడిపేటప్పుడు వెనకా ముందు చూసుకొంటూ ముందుకు వెళ్లాలనే కనీస జ్ఞానం కూడా మనుషుల్లో ఉండటం లేదు. వారు నడిపేది పెద్ద పెద్ద వాహనాలు, అలాంటి వాహనం చిన్న వాహనానికి తాకినా, లేక పెద్ద వాహన చోదకులే వెళ్లి తాకిన ప్రాణ నష్టం గాని, మరే యితర రకంగా లాస్ అయ్యేది చిన్న వాహన దారుడే.


కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలో మరణించేవారి శరీరాలు దారుణంగా చితికి పోతున్నాయి. ఇలాంటి ఘటనే దీపావళి రోజున విశాఖ నగరంలో జరిగింది. నూరెళ్లు బ్రతకవలసిన ఓ యువకుడు అర్దాంతరంగా మృత్యువు ఒడికి చేరాడు.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం  జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆ యువకుడు మధురవాడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన సత్యాల శరణ్‌ (24) డెయిరీ ఫారమ్‌ జంక్షన్‌ సమీపంలో ఓయో హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు.


ఆదివారం వెంకోజీపాలెంలో ఉన్న తన స్నేహితుడిని తీసుకు రావడానికి బైక్‌పై బయలుదేరాడు. పాపం మృత్యువు అతనికోసం అక్కడే పాగా వేసిందని గ్రహించలేకపోయాడు. అతని వెనకే మితిమీరిన వేగంతో వచ్చిన లారీ డెయిరీ ఫారం వద్ద శేఖర్‌ బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగని లారీ బైక్‌తో పాటు శేఖర్‌ను మద్దిలపాలెం జంక్షన్‌ వరకు మూడు కిలోమీటర్లు మేర ఈడ్చుకుపోయింది.


అంతవరకు ఏం జరుగుతుందో చూసుకోని లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న స్థానికులు ఇదిచూసి కేకలు వేయడంతో లారీ రోడ్డు పక్కన నిలిపాడు.అప్పటికే పాపం ఈ ఘటనలో శరణ్‌ శరీరం నుంచి కాలు, చేతులు విడిపోయాయి. ఈ దారుణ సంఘటన గురించి సమాచారం అందుకున్న  పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి లారీ డ్రైవర్న్ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: