మొత్తానికి  పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చెయ్యడానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాడు.  జనసేన పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాడు.  నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి... ఈ రోజు జనసేన పరిస్థితికి పెద్దగా  వ్యత్యాసమే లేదు. పైగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు.  అయినా పవన్ మాత్రం వెనుక అడుగు వేసే  పరిస్థితి లేదంటున్నాడు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి..   రోజురోజుకి ప్రజల్లో  తన పై నమ్మకాన్ని కల్పించాలని ప్రయతిస్తున్నాడట. ఇక నుండి  ముందుచూపు రాజకీయాలు చేస్తూ.. జనసేనను ప్రజల్లో తీసుకువెళ్లే కార్యక్రమాల్లో నిత్యం చేస్తూ ఉంటే..  తనకు ఎప్పటికైనా  రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాడట.  అందుకే ఇప్పటికే ప్లాన్ ప్రకారం పవన్ ప్రజల్లోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాలు ప్రెస్ నోట్ లకే పరిమితం చేయడం పవన్ కళ్యాణ్ కి అలవాటే అనుకోండి అది వేరే విషయం. 

అలాగే ఇటు సినిమాలు కూడా చేయాలని డిసైడ్ అయ్యాడు. పార్టీ మనుగడ కోసం డబ్బు కావాలని, అందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ చెప్పబోతున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్ లో పవన్ నటించబోతున్నాడు.  తానూ సినిమాల కోసం రాజకీయాలకు దూరం అయిన  ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తన పీఏ ద్వారా అడిగి తెలుసుకుంటాడట.   మొత్తానికి పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం వైపు అడుగులు వేస్తున్నాడు. 

ఇకనుంచీ ప్రజల్లో.. అలాగే సినిమాల్లో కూడా పవన్ మేము ఉంటాం అని.. ముందుకు వెళ్తున్నాడు. ఏమవుతుందో..? మరోపక్క   'జ‌న‌సేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువ‌గా  ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకుంద‌ని' పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపిస్తాడని అభిమానులు సైతం కామెంట్లు పెడుతున్నారు. మరి భవిష్యత్తులోనైనా  ఏపీకి పవన్ సీఎం అవుతారేమో చూడాలి. జనసేనికులు మాత్రం రానున్న ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ స్టామీనా ఏంటో చూపిస్తామని.. పవన్ ఇలాగే రాజకీయాల్లో కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో  సీఎం అవడం ఖాయం అని జనసేనికులు ఆశ పడుతున్నారు. పవన్ సినిమా వ్యవహారాలు చూస్తే అది కష్టమే అనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: