హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. అందుకు ప్రస్తుతం ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదు. అందుకే స్కైవేలు నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కొన్ని ప్రాంతాల్లో రక్షణశాఖ భూములు అవసరం ఉంది. అందుకే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.


హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న స్కై వేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ నుంచి నాగపూర్ జాతీయ రహదారి వైపు మరియు హైదరాబాద్ నుంచి రామ గుండం రహదారి వైపు నిర్వహించే ఈ రెండు స్కైవేలకు సంబంధించి కంటోన్మెంట్ మరియు రక్షణ శాఖ భూములను అప్పగించాలని గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తుందని తెలిపారు. ఈ మేరకు గతంలోనూ పలు సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాజ్ నాధ్ సింగ్ కు గుర్తు చేశారు.


ఈ స్కై వేల నిర్మాణంతో హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు సాధ్యమైనంత వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని, వీటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ కు కు కేటీఆర్ తెలిపారు. అయితే ఈ విషయంలో గతంలోనూ కేటీఆర్ ప్రయత్నాలు జరిపారు. గతంలో ఏకంగా కేసీఆర్ కూడా మోడీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు.


కానీ రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంలో మాత్రం ముందడుగు కనిపించడం లేదు. గతంలో సెక్రటేరియట్ కోసం కేసీఆర్ కంటోన్మెంట్ భూములను అడిగారు. అప్పుడు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. మరి ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ మాత్రం సానుకూలంగా స్పందిస్తారో లేదో.. చూడాలి. మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: