వైసీపీలో నోరున్న పేరున్న నేతలకు కొదవలేదు. అయితే అందరూ సీన్ లోకి రావాలి. అలా ముందుకు కదలాలి. ప్రత్యర్ధి పార్టీని చీల్చిచెండాడాలి.  అపుడే కదా మజా. అయితే అగ్రెసివ్  గా దూసుకువెళ్ళే తత్వం వైసీపీ విపక్షంలో ఉన్నపుడు కనిపించింది. ఇపుడు అధికారంలోకి వచ్చాం కదా అని చాలా మంది రిలాక్స్ అయ్యారులా ఉంది. అయితే నో రిలాక్స్ అంటోంది  ప్రధాన ప్రతిపక్షం. మీకు ఆ చాన్స్ ఇవ్వమని చెప్పేస్తోంది. సై అంటూ తోడగొడుతోంది. అసత్యాలో అర్ధ సత్యాలో అసలు సత్యాలో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం రండి అంటోంది. మరి వైసీపీ లో పెద్ద నోర్లు ఏం చేస్తున్నట్లు.


ఆర్ కే రోజా వైసీపీలో సీనియర్ నాయకురాలు. జగన్ వెంట పదేళ్ళ పాటు తిరిగిన మహిళానేత. రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వైసీపీ గెలవడంతోనే మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే హోం శాఖను కన్ ఫర్మ్ చేశారు ఫ్యాన్స్. అయితే రోజాకు ఆ అవకాశం దక్కలేదు. జగన్ సామాజిక సమీకరణలో భాగంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సివచ్చింది. ఇక  రోజా అసంత్రుప్తి చెందారని వార్తలు వచ్చాయి. దాంతో జగన్ ఆమెను పిలిపించుకుని మరీ కీలకమైన నామినేటెడ్ పదవిని ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా రోజా నియమితులయ్యారు. క్యాబినెట్ ర్యాంక్ పదవిలో రోజా కూర్చున్నా కూడా ఎక్కడా అయిపూ అజా లేదని అంటున్నారు. ఆమె వాయిస్ ఇపుడు అసలు వినిపించడంలేదని చెబుతున్నారు. చంద్రబాబుని మాటలతో  ఆడేసుకునే రోజా మీడియా ముందుకు రాకపోవడం ఓ విధంగా వెలితిగానే చెప్పాలి.


ఓ వైపు ఏపీలో విపక్షం రెచ్చిపోతోంది. పవన్ కళ్యాణ్ ఏకంగా జగన్ని నేరస్థుడు అనేశారు. ఇసుక పొరాటం పేరిట లోకేష్ హల్ చల్ చేస్తున్నారు. చంద్రబాబు అయితే జగన్ని వ్యక్తిగత దూషణలతో దండెత్తివస్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు సైతం జగన్ మీద నానా రకాల బండలు వేస్తున్నారు. ఇంత జరుగుతూంటే రోజా మాత్రం పెద్ద గొంతు చేసుకోవడంలేదు. కారణం ఏంటో. మరో వైపు రోజా జబర్దస్త్ ప్రొగ్రాంస్ లో బిజీగా ఉంటోంది. ఆమెకు కీలకమైన క్యాబినెట్ పదవి ఇచ్చినా కూడా జబర్దస్త్ లోఏ ఉండడం పట్ల కూడా వైసీపీలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మరి జగన్ పదవులు తీసుకున్న వారిని బాధ్యతతో పనిచేయమంటున్నారు. అవి అలంకారం కారాదని ఆయన హెచ్చరిస్తున్నారు. రోజా కీలకమైన పదవిలో ఉన్నారు. ఇపుడు ఆమె పెదవి విప్పకపోతే పదవి పోతుందా, ఉంటుందా. అసలు ఇంతకీ ఈ ఫైర్ బ్రాండ్ గొంతు ఎందుకు లేవడంలేదు. ఆమె ఇంకా అలకపానూ దిగలేదా. అనేకమైన ప్రశ్నలు ఇలా వస్తున్నాయి. సమాధానం మాత్రం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: