తెలంగాణ రైతు కంటే ఏపీ రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. అదేంటి వ్యవసాయంలో తెలంగాణ కంటే ఏపీ రైతులు ముందు ఉంటారు కదా.. అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జగన్ చెబుతున్నది ఆయిల్ పామ్ రైతుల గురించి. తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.


వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో జగన్ ఈ విషయం చెప్పారు. ఆయిల్‌ఫామ్‌ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని సీఎం దృష్టికి తీసుకురావడంతో రూ. 87 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. తెలంగాణతో సమానమైన రేటు ఆయిల్‌ఫామ్‌ రైతులకు ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా పెదవేగిలోని ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


గత ప్రభుత్వం ఫ్యాక్టరీలను మూసివేశారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఒక ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించడం వ్యవసాయ చరిత్రలో గొప్ప విషయంగా భావిస్తున్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభించారు. రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉచిత పంట బీమా పథకం బ్రహ్మాండంగా ఆదరణ పొందింది.2018లో లెక్కల ప్రకారం 15 లక్షల 50 వేల మంది రైతులు మాత్రమే పంటలకు ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం 21.5 లక్షల మంది ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. ఏరియా వైజ్‌ చూసుకుంటే 18 లక్షల 50 వేల హెక్టార్లకు పంటల బీమా జరిగితే.. ప్రస్తుతం 27.01 లక్షల హెక్టార్లకు పంట బీమా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.


భవిష్యత్తులో అన్ని పంటలు బీమా పరిధిలోకి వచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. రైతులకు ఇంకా మేలు జరగాలనే చర్చలో మరొక 2 వేల వాతావరణ పరిశీలన కేంద్రాలను గ్రామాలను ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. అందుకు నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: