బీజేపీ పాలిత రాష్ట్రం, 2000 సంవ‌త్స‌రంలో ఏర్ప‌డిన ప్ర‌త్యేక రాష్ట్రం జార్ఖండ్‌లో తాజాగా ఎన్నిక‌ల న‌గారా మోగింది. మొత్తం 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం ఐదు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ రాష్ట్రానికి సంబందించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేసింది. న‌వంబ‌రు 30, డిసెంబ‌రు 7, డిసెంబ‌రు 12, డిసెంబ‌రు 16, డిసెంబ‌రు 20 తేదీల్లో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన‌ట్టు ఈసీ వెల్ల‌డించింది. నేటి నుంచే షెడ్యూల్ అమ‌ల్లోకి రానుంది. అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన రాష్ట్రం కావ‌డంతోనే ఐదు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఈ సీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


తొలిద‌శ‌లో 13 నియోజ‌క‌వ‌ర్గాల‌కు, రెండో ద‌శ‌లో 20, మూడో ద‌శ‌లో 17, నాలుగో ద‌శ‌లో 15, ఐదో ద‌శ‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. గిరిజ‌న గ్రామాలు, జిల్లాలు అత్య‌ధికంగా ఉండడం తోపాటు మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రం కావ‌డంతో ఈ రాష్ట్రంలో ఎన్నిక‌లకు భారీ స్థాయిలో బ‌ల‌గాల‌ను కూడా వినియోగిస్తున్న‌ట్టు ఈసీ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.  ఇదిలావుంటే, కేంద్రంలో వ‌రుస‌గా రెండో సారి భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీకి ఈ రాష్ట్రాన్ని నిల‌బెట్టుకోవ‌డం ఇప్పుడు అత్యంత అవ‌స‌రంగా మారింది.


ప్ర‌స్తుతం జార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగిస్తోంది.  ఆల్ జార్ఖండ్ స్టూ డెంట్స్ యూనియ‌న్‌(ఏజేఎస్‌యూ)తో పొత్తు పెట్టుకున్న బీజేపీ 2014లో ఇక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చే సింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ మొత్తం 81 స్థానాల‌కు గాను 35 చోట్ల విజ‌యం సాధించింది. ఈ క్ర‌మం లో నే ఏజేఎస్‌యూ 17 సీట్ల‌ను గెలుచుకోవ‌డంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా బీజేపీ కి చెందిన సీనియ‌ర్ నేత ర‌ఘువ‌ర్ దాస్ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ పాలిత రాష్ట్రంలో అధికా రం నిల‌బెట్టుకోవ‌డం ఇప్పుడు బీజేపీకి అత్యంత అవ‌స‌రంగా మారింది.


ఇటీవ‌ల జ‌రిగిన రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌భావాన్ని ప‌రిశీలిస్తే.. బీజేపీ పాలిత హ‌రియాణా, మ‌హారాష్ట్ర లో పార్టీ పుంజుకున్న ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. గ‌తంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ పొత్తుతో ప్ర‌భుత్వా న్ని ఏర్పాటు చేసిన బీజేపీ. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో సొంతంగానే పుంజుకుంటామ‌ని, మోడీ హ‌వా క‌నిపిస్తోంద‌ని, త‌మ‌కు పొత్తుల‌తో ప‌నిలేద‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పినా.. త‌ర్వాత ప‌రిణామాల‌ను చూస్తే.. ఓట్లు , సీట్లు త‌గ్గిన ప‌రిస్థితి క‌నిపించింది. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ కూడా ఇలాంటి ప‌రిస్తితే క‌నిపిస్తుందా?  లేక జార్ఖండ్‌లో పుంజుకుంటారా?  అనేది వేచి చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: