ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఖరిలో చాలా మార్పులు వచ్చినట్లు స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల ముందు వరకు టీడీపీ, ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసిన పవన్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు లైన్ లోనే పవన్ వైసీపీ మీద విమర్శలు చేస్తున్నట్లు అర్ధమవుతుంది. టీడీపీ ఏదైతే పాయింట్ మీద వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందో...పవన్ కూడా అదే పాయింట్ మీద రాజకీయం చేస్తున్నారు.


అందుకే వైసీపీ నేతలు పవన్ ని....చంద్రబాబుకు దత్తపుత్రుడు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా పవన్....చంద్రబాబు లైన్ లోనే నడుస్తున్నాడని చెప్పడానికి కారణాలు లేకపోలేదు. ఏపీలో ఉన్నట్లే జనసేన తెలంగాణలో కూడా ఉంది. అయితే కొంచెం పట్టు తక్కువైన అక్కడ పార్టీ నడిపిస్తున్నారు. లోక్ సభ, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈ విషయం పక్కనబెడితే పవన్...ఏపీలో జగన్ మీద దూకుడుగా వెళుతున్నట్లు తెలంగాణలో కేసీఆర్ మీద వెళ్ళడం లేదు. తెలంగాణలో ఉన్న సమస్యల మీద పెద్దగా స్పందించడం లేదు.


ఒకవేళ స్పందించిన ఏదో సున్నితంగా విమర్శలు చేస్తారు. గత కొంతకాలంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పవన్ మొదట్లో సున్నితంగానే మాట్లాడారు. అయితే తాజాగా మాత్రం  తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు 48 గంటల డెడ్ లైన్ ఇస్తున్నానని, అప్పట్లోగా స్పందించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. సరే సమస్య చాలా పెద్దది కాబట్టి ఆ మాత్రమైన స్పందించారు.


ఇదే సమయంలో ఏపీలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగా మొదట ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగిణిస్తామని చెప్పారు. కానీ పవన్ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంచి పనులు చేసినప్పుడు స్పందించకుండా ఉండిపోవడం ఏంటో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసినప్పుడు...ఏపీలో చేస్తున్న దానికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడకపోవడం పవన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.



మరింత సమాచారం తెలుసుకోండి: