జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన వారి ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటోంది. పవన్ స్టార్ డం కూడా సినిమాలు లేక తగ్గిపోతోంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించింది లేదు. ఆయనది అయిదేళ్ళ రాజకీయం. ఇదంతా తెలుగుదేశం నీడన సాగిందని ప్రత్యర్ధులు అంటారు. పవన్ మాత్రం ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారన్న పేరు మాత్రం సంపాదించారు.


ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ విషయంలో ఓ విధంగా ఇది అవమానంగానే చెప్పాలి. ఆయనకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఈ విషయాన్ని పవనే ఓ ప్రకటన ద్వారా వివరించారు. కేసీయార్ అపాయిట్మెంట్ కోసం సీఎంవో  ఆఫీస్ ని జనసేన పార్టీ నాయకులు కాట్రాక్ట్ చేస్తే  అక్కడ సమాధానం లేదు. అదే విధంగా కేసీయార్ ను కలవాలనుకున్నా, సీనియర్ నేత కేశవరావుని కలవాలనుకున్నా కూడా కుదరలేదని పవన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి పవన్ 30 రోజులుగా సాగుతున్న  ఆర్టీసీ సమ్మె విషయంలో వారికి మద్దతుగా ప్రభుత్వం వద్ద  వాదనలు వినిపించాలనుకున్నారు. ఈ విషయంలో తనను కలసిన కార్మికలకు ఆయన భరోసా ఇచ్చారు. దానికి తగినట్లుగా కలుద్దామంటే కేసీయార్ నో అప్పాయింటెంట్ అనేశారు.


ఇదిలా ఉండగా సరిగ్గా రెండేళ్ళ క్రితం అంటే 2018 జనవరిలో పవన్ కళ్యాణ్ కి కేసీయార్ ప్రగతి భవన్ల్లో గొప్ప రీతిన స్వాగతం లభించింది. మర్యాదలు కూడా దక్కాయి. కానీ ఇంతలోనే ఇలా కేసీయార్ తలుపులు మూయడం వెనక పవన్ రాజకీయ చరిస్మా దిగజారడం ఒక ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.  మ‌రో వైపు ఏపీలో బీజేపీ సైతం పవన్ కి దూరంగా ఉంటామని అంటోంది. ఒక్క చంద్రబాబు తప్ప పవన్ని ఎంటర్ టైన్  చేసేవారు ఎవరూ లేరని పొలిటికల్ సీన్ చూస్తే అర్ధమైపోతోంది. మరి పవన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: