జగన్ ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర అభివ్రుధ్ధి కోసం చిత్త శుద్ధితో క్రుషి చేస్తున్నారు. ఇది ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తారు. పాలనానుభవం లేకపోయినా కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన తన వంతుగా చేయాల్సింది చేస్తున్నారు. ఇక కేంద్రం భారీగా సాయం చేస్తుందనుకుంటే రిక్త హస్తం చూపిస్తోంది. పైగా ఇక్కడ బీజేపీ నాయకుల మాటల తూటాలు చికాకు పెడుతున్నాయి.


జగన్ ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా కేంద్ర పాలకులు కనీసం స్పందించడంలేదు. ఈ నేపధ్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా జగన్ తన మనసులోని ఆవేదనను కొంత జనంతో పంచుకున్నారా అనిపించింది  ఆయన మాటలు వింటూంటే. ఏపీని దగాపడ్డ రాష్ట్రంగా జగన్ అభివర్ణించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా ఒక్క ఏపీ అన్ని విధాలుగా దగాపడి వెనకపడిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రులు మద్రాస్, హైదరాబాద్ లో శ్రమ పరిశ్రమ చేసి కష్టాన్ని అక్కడే  వదిలేసి వచ్చారని కూడా జగన్ చెప్పుకొచ్చారు. విభజన విషయంలో కూడా జగన్ తనదైన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఏపీ ఇలా విడిపోతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని ఆయన అన్నారు.


అదే విధంగా వైఎస్సార్ సీఎం గా ఉండగా కనీసం ఎవరూ వూహించుకోలేదని కూడా జగన్ చెప్పుకొచ్చారు. తరువాత విభజన జరిగి అన్ని విధాలుగా నష్టపోయిందని ఆయన అన్నారు. అయినా తాము మొక్కవోని ధైర్యంతో ముందుకు అడుగులులు వెస్తున్నామని జగన్ చెప్పారు. అంతా కలసి ఏపీని బాగుచేసుకుందామని ఆయన పిలుపు ఇచ్చారు. జగన్ స్పీచ్ లో కేంద్రం సాయం చేయడం లేదన్న మాట నేరుగా రాకపోయినా ఆవేద‌నలో అర్ధం మాత్రం అదేనని అంటున్నారు.  


మొత్తానికి కేంద్రం ఏపీకి రిక్తహస్తం చూపిస్తోందని జగన్ చెప్పకనే  చెబుతున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు టైంలో కొంత వరకైనా సాయం చేసిన కేంద్రం ఇపుడు రాజకీయ కారణాలతోనే ఏపీని పూర్తిగా  పక్కన పెడుతోందని కూడా అంటున్నారు. మరి దీనిమీద గుచ్చుకున్నట్లుగా బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. విభజన వూసు తలవకుండా ఏపీ అభివ్రుధ్ధి కోసం ముందుకు అడుగులు వేయాలని ఆయన సూచిందారు. అదే విధంగా కేంద్రం సాయం చేస్తోందని కూడా ఆయన పెర్కొనడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: