ఏపీ ఆయిల్ పామ్ రైతులు తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. అందుకే ఏపీలోనూ ఈ రైతులను ఆదుకోవాలని జగన్ నిర్ణయించారు. ఆయిల్‌ఫామ్‌ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని సీఎం దృష్టికి తీసుకురావడంతో రూ. 87 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. తెలంగాణతో సమానమైన రేటు ఆయిల్‌ఫామ్‌ రైతులకు ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా పెదవేగిలోని ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


గత ప్రభుత్వం ఫ్యాక్టరీలను మూసివేశారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఒక ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించారు. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఇలా జగన్ ఆయల్ పామ్ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో పామాయిల్‌ రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. పామాయిల్‌ రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు.


దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ దెందులూరు వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సదస్సు ఏర్పాటు చేశారని, ఆ సదస్సుకు పామాయిల్‌ రైతులు తరలివచ్చి వారి ఇబ్బందులను వైయస్‌ జగన్‌కు వివరించారన్నారు. ఏపీలో పంటకు, తెలంగాణలో పంటకు ఓఈఆర్‌ డిఫరెంట్‌ ఉందని, రూ. వెయ్యి పైచిలుకు తక్కువగా ఇస్తున్నారని చెప్పగా.. మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. పామాయిల్‌ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, వనిత, ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లాం బృందాన్ని పంపించారన్నారు. వారంతా రైతుల కష్టాలు తెలుసుకోవడంతో పాటు పెదవేగి ఆయిల్‌ ఫ్యాక్టరీని పరిశీలించారన్నారు.


పెదవేగి ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. అదే విధంగా పామాయిల్‌ రైతులను ఆదుకోవడానికి తెలంగాణతో సమానమైన రేటు ఇవ్వాలని రూ.87 కోట్లు మంజూరు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: