పోలవరం నిర్మాణంలోమరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు గోదారమ్మ కూడా శాంతిస్తోంది. అందుకే ఇక పోలవరం పనుల జోరు పెంచాలని జగన్ సర్కారు భావిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే జగన్ పోలవరం నిర్మాణం ఆపేశాడని ఎల్లో మీడియా, టీడీపీ బాగానే ప్రచారం చేశాయి. పోలవరం పనుల నిలిపివేత కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది.


కానీ ఇప్పుడు ఈ సీన్ మారిపోయింది. వైయస్ ఆశయం, జగన్ లక్ష్యం పోలవరం పూర్తయ్యే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ పోలవరంలో భూమిపూజ చేసి శరవేగంగా పనులు మొదలుపెట్టింది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ విత్ డ్రా కాగానే శుక్రవారం పోలవరం స్పిల్ వే ఎగువ ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు.


సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం...పోలవరానికి తొలి ప్రాధాన్యం ఇస్తామంటూ నవరత్నాల్లో ప్రకటించినట్టుగానే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం పనులు ఎంతవరకూ పూర్తి అయ్యాయో, ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణాల నాణ్యత ఎలా ఉందో, కాఫర్ డ్యాం, స్పిల్ వే ల నిర్మాణ ఎలా జరిగిందో అన్నీ కూలంకషంగా పరిశీలించారు.


అప్పుడే పోలవరం నిర్మాణాన్ని 2021 జూన్ కల్లా పూర్తి చేయాలని, అది పూర్తయిన 10 నెలల్లోపే హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యాలను పక్కాగా నిర్దేశించుకున్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల నష్టపరిహారం గురించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ లక్ష్యాల మేరకే పని చేస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా 844 కోట్లు ఆదా చేసారు. నవయుగ ద్వారా పోలవరం పనులు ముందుకు కదలకుండా అడ్డుపడేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని విమర్శలు ఉన్నాయి. కానీ హైకోర్టు తీర్పుతో ఆ అడ్డంకి తొలగిపోయింది. మరి జగన్ ఇదే జోరుతో రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాడా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: