తెలుగుదేశం పార్టీ పెను సంక్షోభంలో ఉందా. అధినేత చంద్రబాబు మీద నానాటికీ నమ్మకం దిగజారిపోతోందా. భవిష్యత్తు మీద బెంగ పట్టుకుందా. తెలుగు రాజకీయాల్లో పసుపు పార్టీ శకం ముగిసినట్లేనా. ఈ రకమైన చర్చ ఇపుడు వాడి వేడిగా సాగుతోంది. టీడీపీ ఘోరంగా ఓడిపోయి అయిదు నెలలు గడచినా కూడా ఆ పార్టీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేనే లేదు. పైగా చంద్రబాబు తీరు కూడా మారకపోవడం కిందా పడ్డా పై చేయి అన్నట్లుగా వ్యవహరించడం తప్పు ఎక్కడుందో తెలుసుకోకుండా తాను ఇప్పటికీ సీఎం అన్న భావనలో ఉండడంతో టీడీపీకి అసలుకే  ఎసరు తెస్తోందని అంటున్నారు.


ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా 16 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన  ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తాజాగా ప్రకటించి సంచలనం రేకెత్తించారు. తమతో వారంతా టచ్ లో ఉన్నారంటూ ఆయన పేల్చిన బాంబు ఇపుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టినింది. చేరండి అంటూ  ఒక్కసారి జగన్ గేట్లు తెరిస్తే చాలు అంతా  కలసి కట్టకట్టుకుని మరీ వైసీపీలో చేరిపోతారంటూ నారాయణ‌స్వామి భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.


ఇప్పటికే టీడీపీలో వంశీ ఎపిసోడ్ తో తల్లకిందులు అవుతున్న టీడెపీ హై కమాండ్ కి ఈ తాజా వార్త గుండెల్లో గుబులు రేపేలా ఉందని అంటున్నారు. 2019 ఎన్నికలలో మొత్తానికి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. వీరిలో చాలా మంది ఇప్పటికే సైలెంట్ గా ఉంటున్నారు. చంద్రబాబు జిల్లాల టూర్ల పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కూడా పెద్దగా ఆకట్టుకోవడంలేదు. దాంతో టీడీపీ భవిష్యత్తు మీద ఎమ్మెల్యేలకు బెంగగా ఉందని అంటున్నారు. ఇపుడు నారాయణస్వామి పేల్చిన బాంబు కనుక నిజమైతే టీడీపీ దుకాణం మూత వేసుకోవాల్సిందే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: