మ‌హారాష్ట్రలో అక్టోబ‌ర్ 24వ తేదీన ఫ‌లితాలు వ‌చ్చినా.. ఇంకా ప్ర‌భుత్వ ఏర్పాటు జ‌ర‌గ‌లేదు. అయితే న‌వంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మ‌యం ఉండ‌టం, మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో.....మహారాష్ట్రలో కొత్త పొత్తులు తెరమీదకు రాబోతున్నాయా అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమి బీటలు వారుతోందని...శరద్‌ పవార్‌ నేతృత్వంలోని NCPని శివ‌సేన మ‌చ్చిక చేసుకుంటోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ స‌మ‌యంలో...శివ‌సేన అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 


శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ఫోన్లో మాట్లాడినట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసమే ఉద్ధవ్‌ పవార్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోందని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పటికే ఉద్దవ్‌ అనుంగ అనుచరుడు ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్వయంగా వెళ్లి పవార్‌ను కలిసి మాట్లాడారు. బీజేపీకి వరుస వార్నింగ్‌లు ఇస్తోంది. బీజేపీ అవసరం లేకుండానే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ అహంకారం మా దగ్గర చూపించొద్దని బీజేపీ ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. కచ్చితంగా శివసేన నాయకుడే మహారాష్ట్ర సీఎం అవుతాడు. కావాలంటే రాస్కోండి అని స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌నుంద‌నే అంచ‌నాకు ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. అయితే, తాజాగా శరద్‌ పవార్‌ మీడియాతో స్పందిస్తూ వీటిని తోసిపుచ్చారు. 


ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో తాను స‌మావేశం అయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని శ‌ర‌ద్ ప‌వార్ కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాతో మాత్ర‌మే చ‌ర్చించాన‌ని పేర్కొన్నారు. అయోధ్యపై తీర్పు వెలువడక ముందే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఇది బీజేపీ-శివసేన కూటమికే కాకుండా అందరికీ శ్రేయస్కరమని తెలిపారు. గత ఏడాది అయోధ్య విషయంపై ముంబైలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, అలాంటి హింసాకాండ మళ్లీ జరుగకుండా చూడాలన్నా, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్నా ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరి అని చెప్పారు. 
ఇదిలాఉండ‌గా, తాజా పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది.  మహారాష్ట్ర రాజకీయాలపై ప్రధాని మోడీ, బీజేపీ అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా మాత్రమే పరిశీలిస్తున్నారు. శివసేన ఎన్ని ఘాటైన విమర్శలు, వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదు.  మహారాష్ట్ర నేతలెవ్వరినీ మాట్లాడొద్దని ఢిల్లీ అధిష్ఠానం గట్టి ఆదేశాలే ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: