చంద్రబాబు విషయంలో ప్రత్యర్ధులు ఒక మాట అంటూ ఉంటారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమని చెబుతూంటారు. అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు, ఎంత దూరమైన వెళ్తారని కూడా విమర్శిస్తారు. ఇక చంద్రబాబు ఇది నా విధానం, ఆరు నూరు అయినా ఇలాగే  ఉంటాను అని గట్టిగా పట్టుపట్టి చెప్పుకోరు, అదే ఆయనలో తమాషా అంటారు. బాబు ఎప్పటికి ఏది అవసరమో దానికి తగినట్లుగా నడచుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఆయన బాధపడేది లేదని కూడా చెబుతారు.


చిన జీయర్ స్వామి బాబుల మధ్యన ఉమ్మడి ఏపీలో ఎంతటి రాధ్ధాంతం జరిగిందో అందరినీ తెలిసిందే. వేయి కాళ్ళ మండపం కూల్చేయవద్దూ అంటూ నెత్తీ నోరూ  జీయర్ స్వామి బాదుకున్నారు. అయినా కూడా బాబు కనీసం వినిపించుకోలేదు. ఈ విషయంలో జీయర్ స్వామి ధర్మాగ్రహం ప్రకటించారు. అది ఎంతవరకూ వెళ్ళిందంటే చివరికి బాబుకు, జీయర్ కి మధ్య వ్యక్తిగత వైరంగా దారితీసింది. జీయర్ స్వామి ధర్మం కోసం లేవనెత్తిన అంశాన్ని రాజకీయం చేసి బాబు నాడు ఆయన్ని అవమానించారు.


ఈ నేపధ్యంలో రెండు దశాబ్దాలు గడచిపోయాయి. బాబు ఉమ్మడి ఏపీలో పదేళ్ళ విపక్ష నేతగా పనిచేశారు. ఆ తరువాత విభజన ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నాళ్ళలోనూ కూడా జీయర్ స్వామి అశ్రమానికి బాబు రాలేదు, పలకరించలేదు. కానీ హఠాత్తుగా హైదరాబాద్ లో తిరు నక్షత్ర వేడుకలు జరుగుతున్న ఛినజీయర్ స్వామి ఆశ్రమ  వేదిక వద్దకు బాబు వచ్చి అందరినీ విస్మయానికి గురి చేశారు. చిన జీయర్ కు పాదాభివందనం కూడా చేశారు


బాబుకు స్వామిజీల మీద పెద్దగా నమ్మకాలు అయితే లేవు. కానీ వారిని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు వాడుకుంటారని అంటారంతా. ఇపుడు చినజీయర్ స్వామి వద్దకు వచ్చిన బాబు రేపో నేడో శారదాపీఠం స్వామిజీ వద్దకు వచ్చినా ఆశ్చర్య‌పోనవసరం లేదని అంటున్నారు. ఛిన‌ జీయర్ తో పోల్చితే స్వరూపానందేంద్రతో బాబుకు ఎపుడూ ప్రత్యక్షంగా గొడవలు లేవు కూడా. మరి ఇద్దరు సీఎంలకు రాజశ్యామలా యాగం చేసి ముఖ్యమంత్రి సీటు ఇప్పించిన స్వరూపానందేంద్ర తన వద్దకు బాబు కనుక వస్తే ఆయన పేరిట కూడా యాగాలు, హోమాలు చేసి మళ్ళీ సీఎం కుర్చీని ఇప్పించే చాన్స్ ఉందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: