బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు, అధికారం ఉన్న చోట రాజకీయ నేతలు వాలిపోవడం కామన్. గత పది సంవత్సరాలుగా తెలుగు రాజకీయాలను గమనిస్తుంటే ఈ విషయం  బాగా అర్ధం  అవుతోంది. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే  ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక వచ్చే ఐదేళ్లు పాటు ప్రతిపక్షంలో ఉండాల్సిరావడంతో  ఆగలేని టీడీపీ,జనసేన నేతలు ఇప్పుడు  వరుస పెట్టి  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలోకి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోకి జంప్ చేసేస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ జపాంగ్ జాబితాలో చేరుతుండడంతో టిడిపి, జనసేన అధినాయకత్వంలకు పెద్ద తలనొప్పిగా మారింది.


ఓవైపు క్యాడర్ ని  కాపాడుకోవడంతో పాటు మరోవైపు లీడర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే టైంలో అటు ప్రభుత్వంపై పోరాటం కూడా చేయాల్సి వస్తోంది. తాజాగా ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి చేసిన కామెంట్లు టిడిపిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం టిడిపి కి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ షాక్ నుంచి టిడిపి కోలుకోకుండానే  నారాయణస్వామి తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు.


జగన్ ఓకే చెప్తే వాళ్ళంతా వైసీపీలోకి వస్తారు అని ఆయన ప్రకటించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారా అంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టిడిపి వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరిని అనుమానించాలి, ఎవరిని అనుమానించకూడదు  తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇసుక పోరాటాన్ని ఉధృతం చేసే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో లాంగ్ మార్చ్ ప్రకటించిన జనసేనకు శనివారం పెద్ద ఝలక్ తగిలింది. దానికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు, బిజెపి ప్రకటించారు. అంతలోనే ఉత్తరాంధ్రలోను  జనసేనకు పెద్ద షాక్ తగిలింది.


మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పార్టీకి గుడ్ బాయ్  చెబుతున్నట్టు తెలుస్తోంది.. విశాఖ లాంగ్ మార్చ్ ఏర్పాట్లను సమీక్షించిన నాదెండ్ల మనోహర్, నాగబాబు సమావేశానికి కూడా బాలరాజు హాజరు కాలేదు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోదావరి జిల్లాలకు చెందిన పలువురు జనసేనకి కీలక  నేతలు సైతం వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో టీడీపీ ,జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు వచ్చే మూడు ,నాలుగు నెలల్లో ఆయా పార్టీలను వీడేందుకు రెడీ అవుతున్నారు. ఈ వరుస జంపింగుల ఎఫెక్ట్ తో టీడీపీ,జనసేన ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: