ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌.. జ‌గ‌న్‌త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు బాగానే చేరువ‌య్యారు. దీంతో ఇప్పుడు రా ష్ట్రాన్ని అభివృద్ధి బాట‌లో న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి రా ష్ట్రంలో అభివృద్ది అంటే.. తానేన‌ని గ‌త సీఎం చంద్ర‌బాబు డ‌ప్పుకొట్టుకునే వారు. అలాంటి నాయ‌కుడిని తల‌ద‌న్నేలా జ‌గ‌న్ ఇప్పుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు.


అంటే, దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌తో ఏపీనిపోటీ పెట్టేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు. రాష్ట్ర జీడీపీలో ప్రస్తుతం సుమారు 15 శాతంగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగ వాటాను వచ్చే ఐదేళ్లలో 30–35 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా క్లస్టర్‌ విధానంలో ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.


ఇందులో భాగంగా భావనపాడు, బందరు, రామాయప ట్నం పోర్టులకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన ఈ మూడింటినీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అంతేకాదు, ఆక్వా ఎగుమతులను పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా 46 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలో విడుదల చేసే నూతన పారిశ్రామిక పాలసీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దడం ద్వారా 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీలో కీలక రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చుకుంది.


దేశ జీడీపీలో మన రాష్ట్రం ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో టాప్‌–5లో చోటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది వ‌ర్కవుట్ అయితే, ఇక రాష్ట్రానికి తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఎలా స‌క్సెస్ అవుతాయో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: