మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌కు ప‌తి క‌ష్టాలు చుట్టుముట్టాయి. తండ్రి హ‌వా, ఆయ‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డితో.. త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత 2014లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధిం చిన అఖిల.. తండ్రి భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని కొట్టేశారు. ఇక‌, తల్లి దండ్రుల‌కు ఉన్న మంచి పేరుతో ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లాలో కూడా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నారు. అయితే, మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే అఖిల ప్రియ వివాహం చేసుకున్నా రు.


భార్గ‌వ్ రామ్ అనే వ్య‌క్తిని ఆమె వివాహం చేసుకున్న త‌ర్వాత ఒక్క‌సారిగా ఆమె హ‌వా స‌న్న‌గిల్ల‌డం ప్రారంభ మైంది. నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా కూడా చ‌క్రం తిప్పాల‌ని అనుకున్న అఖిల‌కు భ‌ర్త చేస్తున్న చ‌ర్య‌లు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారాయ‌ని ఆమె అనుచ‌రులే అంటున్నారు. ప్రైవేటు వివాదాల్లో త‌ల‌దూరుస్తున్న భార్గ‌వ్ రామ్‌.. కేసుల్లోనూ చిక్కుకున్నారు. అదే స‌మ‌యంలో దీనిపై పోలీసులు కేసులు న‌మోదు చేసిన స‌మ‌యంలోనూ, త‌ర్వాత కూడా పోలీసుల‌పై దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అఖిల ప్రియ నివాసానికి ఏకంగా ఆళ్ల‌గ‌డ్డ పోలీసులు చేరుకునిభార్గ‌వ్ రామ్ కో సం గాలించారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న అఖిల.. తీవ్ర‌స్థాయిలో పోలీసుల‌పై వ్యాఖ్య‌లు చేసింది. ఏకంగా క‌ర్నూలు ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప టార్గెట్‌గా రెచ్చిపోయింది. అయితే, త‌ర్వాత దీనిపై టీడీపీ నుంచి కానీ, స్థానికంగా కానీ అఖిల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌లేక పోయారు. ఇక‌, తాజాగా ర్గవరామ్‌ మరోసారి ఏపీ పోలీసులపై జులుం ప్రదర్శించారు. గణపతి కాంప్లెక్స్ లోని తన నివాసం వద్ద అనుచరులతో పోలీసుల విధులకు ఆటకం కలిగించారు.


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి వచ్చిన పోలీసులపై ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు. కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. తమ విధులకు ఆటంకం కలిగించిన పవన్, బిన్నయ్య, చిన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఈఇద్ద‌రి కుటుంబ స‌భ్యులు తాజాగా అఖిల ఇంటికి వ‌చ్చి త‌మ వారిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని డిమాండ్ చేశార‌ట‌. అయితే, ఆమె ముఖం చాటేయ‌డంతో పాటు భ‌ర్త‌తోనూ వివాదం పెట్టుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తంగా తండ్రి చాటు బిడ్డ ఇప్పుడు భ‌ర్త మూలాన బ‌జారున ప‌డుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: