కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని ముతక సామెత ఒకటి ఉంది. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు అలా పవన్ కలసివస్తున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను జనం నమ్మి 2019 ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పారు. పవన్ని ఒక పొలిటికల్ ఫోర్స్ గా రావాలనుకునే వారు ఈ కాపీ పేస్ట్ రాజకీయాలను తిప్పికొట్టారు. చంద్రబాబుకే మద్దతుగా ఉంటే వేరె పార్టీ ఎందుకు అందులోనే చేరి ఓ నాయకుడిగా పనిచేయవచ్చు కదా అని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల వెనక పస కూడా అంధ్ర జనం 2019 ఎన్నికల్లోనే గ్రహించబట్టే పవన్ రెండు చోట్ల పోటీ చేసినా ఓటమిపాలు అయ్యారు. 


ఒక పార్టీ ప్రెసిడెంట్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలు కావడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు, ఇది ఒక రికార్డ్ అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కార్యక్రమాలను నెత్తిన పెట్టుకుని మోస్తున్నారని కూడా ఆయన అన్నారు. బాబు చెబుతారు, పవన్ ఆచరిస్తారు అన్నారు మంత్రి అనిల్ కుమార్. సొంత కొడుకు గుంటూర్లో దీక్ష చేస్తే మైలేజ్ రాలేదని, దత్తపుత్రుడు చేత విశాఖలో బాబు  లాంగ్ మార్చ్ జరిపిస్తున్నారని మరో మంత్రి కన్నబాబు అన్నారు.


పవన్ బాబుకు అసలైన దత్తపుత్రుడంటూ మొదట కోట్ చేసింద్ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. నిజానికి ఆయన కరెక్ట్ గానే చెప్పారు కాబట్టే ఇపుడు ఈ దత్తపుత్రుడు మాట అ అంతగా పాపులర్ అయింది. బాబుతో పవన్ కలిస్తే బాబుకు లాభం, పవన్ కి నష్టం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇప్పటికైనా సొంత రాజకీయం చేసుకో పవన్ అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ సలహా ఇచ్చారు. మొత్తం మీద దత్తపుత్రుడు బిరుదు అనుకుని పవన్ కళ్యాణ్ పొంగిపోతూండవచ్చేమో కానీ టీడీపీ ఎన్నడూ లేని విధంగా కునారిల్లిన వేళ పవన్ లాంటి వారు ఎంత మంది వచ్చి పైకి లేపాలనుకున్నా లేచేది కానే కాదని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.



ఎన్నికలకు ఏడాది ముందు విడిపోయినట్లుగా నాటకం ఆడిన పవన్, బాబు ఇద్దరూ ఇపుడు లాంగ్ మార్చ్ అంటూ కొత్త డ్రామా మొదలెట్టారు కానీ నిజానికి ఈ ఇద్దరూ గత అయిదేళ్ళుగా లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.మొత్తానికి దత్తపుత్రుడు పాత్రలో పవన్ ఎంతలా రాణించినా ఆయనకు మిగిలేది ప్యాకేజి తప్ప రాజకీయం కాదని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు హాట్ కామెంట్స్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: