యువతలో చాలామంది చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. యువతలో కొందరు ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను సంప్రదించి వేలకు వేలు సమర్పించి మోసపోతున్నారు. కానీ చాలామంది యువతకు ఏ కంపెనీలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వివరాలు తెలియటం లేదు.  కేంద్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటం కొరకు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు కేంద్రం మంచి అవకాశం కల్పించింది. 
 
ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల వరకు ఈ వెబ్ పోర్టల్ లో ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఈ పోర్టల్ ద్వారా వారి అర్హతకు తగిన ఉద్యోగం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ లేబర్ ఎంప్లాయిమెంట్ విభాగం "నేషనల్ సర్వీస్ కెరీర్" పోర్టల్ ప్రారంభించింది. యువతలో చాలామంది ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలియక చిన్న కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఈ పోర్టల్ ద్వారా ఐటీ, కార్పొరేట్ కంపెనీల జాబ్స్ వివరాలు కూడా సులభంగా తెలుసుకోవచ్చు. 
 
ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవటానికి https://www.ncs.gov.in/ అనే వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. పోర్టల్ లో అర్హత ఉన్న ఉద్యోగాలను చూసుకొని ఆప్షన్లను పూర్తి చేయాలి. సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ చేసిన తరువాత మొబైల్ నంబర్ కు పోర్టల్ యూజర్ ఐడీతో పాటు ఓటీపీ వస్తుంది. ఈ వివరాలు నమోదు చేయగానే 19 నంబర్లు గల యూజర్ ఐడీ వస్తుంది. ప్రతిసారి లాగిన్ కావటం ద్వారా ఉద్యోగాల ఖాళీల వివరాలను, కొత్త ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చు. 
 
ఈ వెబ్ పోర్టల్ లో ఇప్పటివరకు కోటి మందికి పైగా నిరుద్యోగులు రిజిష్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోర్టల్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 18004251514 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఈ పోర్టల్ కు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే తెలుసుకోవచ్చు. ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నంబర్ పని చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటాయి. ఈ పోర్టల్ లో నమోదు చేసుకొనే వారికి ఎంప్లాయిమెంట్ ఎక్స్ ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాల సమాచారం సందేశాల ద్వారా తెలుస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: