ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆదాయాన్ని బట్టి ఖర్చుకు ప్రణాళికా రచన చేసుకుంటారు. ఆదాయం పెరగక పోయినా ద్రవ్యోల్బణం వలన ఖర్చులు అయితే ధారుణంగా పెరిగిపోతుండటం మద్యతరగతి జనాల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. ఓక వైపు కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నటుతున్న వేళ – జనసామాన్యంపై – ఆర్టీసి ఉద్యోగుల సమ్మె సమ్మెట పోటైంది.


ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర విభజనకు ముందే ముఖ్యమంత్రి కేసీఅర్ ఆర్టీసి కార్మికులకు హామీ ఇచ్చిన విషయం జగద్విధితం. అయితే ఆయన ఈ విషయంలో మడమ తిప్పారు నాలుక మడతేశారు. ఈంకేం ఆర్టీసిలో ఉద్యోగ సంఘాలు సమ్మె శఖారావం పూరించటం …ఇరుపక్షాలు పట్టుదలతో సమస్యలను ఒక కొలిక్కి తేలేకపోవటం – జనం దాదాపుగా దినదినం ఆర్ధిక హింసకు గురౌతున్నారు.  అయితే ఇప్పుడు బస్ పాసులున్నవారికి మరో కొత్త సమస్య అదనపు భారం కానుందా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మిగిలింది. 
సంబంధిత చిత్రం
అయితే సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు మూడురోజుల్లో తిరిగి విధుల్లో చేరాలన్నది తెలంగాణ సీఎం తాజాగా విధించిన డెడ్ లైన్. ఆర్టీసీ సమ్మెపై మంత్రి మండలి సమావేశంలో చర్చించిన కేసీఆర్, కొన్ని కీలక ప్రకటనలు చేసిన విషయం మనకు తెలుసు. వాటిలో ఒకటి... 5వేల బస్సులు ప్రైవేట్‌కీ, మరో ఐదు వేల బస్సులు ఆర్టీసీకి అన్న షరతు సరే 


ఆయన లెక్క ప్రకారమే చేస్తారని అనుకుంటే, మరి బస్ పాస్‌లు తీసుకున్నవారి పరిస్థితి ఏంటన్నది తేలాల్సిన అంశం. ఇప్పటివరకూ ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పెద్దగా లేవు కాబట్టి, బస్ పాస్‌లు తీసుకున్నవారికి ఎక్కువ బస్సులు అందుబాటులో ఉండేవి. ఒకవేళ ఐదు వేల బస్సులు ప్రైవేట్‌కి ఇస్తే, బస్ పాస్‌లు తీసుకున్నవారికి, బస్సుల కొరత ఏర్పడుతుంది. దాదాపు 50 శాతం బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని వాళ్లు కోల్పోతారు. సగం సేవలు తగ్గిపోయినట్లే  కాబట్టి, బస్ పాస్‌ల రేట్లను సగానికి తగ్గించ మని డిమాండ్ చెయ్యలేని పరిస్థితి. పోనీ ఆర్టీసీ బస్సుల కోసం ఒక పాస్, ప్రైవేట్ బస్సుల కోసం మరిన్ని పాస్‌లు తీసుకునే పరిస్థితి లేదు. మరి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదన్నది చర్చనీయాంశమవుతోంది.

TSRTC <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BUS' target='_blank' title='bus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bus</a> Pass Problems due to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=STRIKE' target='_blank' title='strike-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>strike</a> కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో, విద్యార్థులు, దివ్యాంగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇలా చాలా మంది బస్ పాస్‌లు కలిగివున్నారు. ఆర్టీసీలో సగం బస్సుల్ని ప్రైవేటీకరిస్తే, వీరంతా ఇబ్బందులు పడాల్సిందే. పోనీ అసలు బస్ పాసే లేకుండా ఏ బస్ ఎక్కితే, ఆ బస్సులోనే టికెట్ తీసుకుందామని అనుకుంటే, ప్రతి రోజూ చిల్లర సమస్య తప్పదు. కండక్టర్లు చిల్లర ఇవ్వాలని కోరడం, ప్రయాణికులు చిల్లర లేదని చెప్పడం, టికెట్ వెనక కండక్టర్ ఇవ్వాల్సిన చిల్లర రాయడం, బస్సు దిగేటప్పుడు ఆ చిల్లర తిరిగి తీసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడటం ఇలాంటివి  సర్వసాధారణం అవుతాయి. అందువల్ల పాస్ కలిగివుండటమే బెటరన్నది ఎక్కువ మంది చెప్పే మాట. బస్సుల్ని ప్రైవేటీకరిస్తే మాత్రం బస్ పాస్ వృధా అన్న వాదన వినిపిస్తోంది.


ప్రైవేట్ బస్ ఆపరేటర్లు బస్ పాస్‌లను అనుమతించరు. సీఎం కేసీఆర్, బస్ పాస్‌లు అందరికీ కొనసాగుతాయనీ, ఎవరికీ పాస్‌లను ప్రభుత్వం రద్దు చేయదని తాజా ప్రెస్‌-మీట్‌లో తెలిపారు. కానీ, ప్రైవేట్ బస్సుల్లో కూడా అదే బస్ పాస్ చెల్లుతుందని చెప్పలేదు. అలా చెల్లితే, ఏ సమస్యా ఉండదు. ఇందుకు ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పుకుంటా రన్న గ్యారెంటీ లేదు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ తాజా ప్రెస్‌మీట్‌ పై ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ భగ్గుమంటోంది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని స్పష్టం చేసింది. ఐతే, నెల రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె వల్ల ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 


*ఉదయాన్నే బస్సులు ఉండట్లేదు. ఉదయం 8 గంటల తర్వాతే బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా కొన్నే. అందువల్ల ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. పోనీ ఏ క్యాబు నో ఆటోనో ఆశ్రయిస్తే, ధారుణమంగా ఛార్జీలు చెల్లించలేని పరిస్థితి. 


*ఫలితంగా నెలకు అదనంగా ₹ 2000/- నుంచీ ₹3000/- వరకు అదనంగా ఖర్చయ్యే పరిస్థితి. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే 3300000 మంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇన్ని రోజులు సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదనీ, ప్రయాణికుల వెతలు పట్టించుకోకుండా రవాణా శాఖ కార్మికులతో కయ్యం పెట్టుకోవటం పట్ల ముఖ్యమంత్రిపై వ్యతిరేఖత విముఖత జనాల్లో పెరిగిపోతుంది. ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం వృధా అని ప్రయాణికులు మండి పడుతున్నారు. 


సాధారణంగా హైదరాబాద్‌లో 3,850 బస్సులు దాదాపు 15000 ట్రిప్పులు తిరుగుతాయి. అలాంటప్పుడే మరో 3000 బస్సులు అవసరం ఉంటూవస్తుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు 1500 బస్సులకు మించి తిరగట్లేదు. అవి కూడా చాలా తక్కువ ట్రిప్పులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లొచ్చే వారికి ఆ టైమ్‌లో బస్సుల కొరత బాగా ఉంటోంది. 


ఉదయం 4 గంటల నుంచే తిరగాల్సిన బస్సులు 7 లేదా 8 గంటల తర్వాతే తిరుగుతున్నాయి. రాత్రి 12 గంటల దాకా తిరగాల్సిన బస్సులు 10 గంటలకే డిపోకి వెళ్లి ముసుగేసుకుంటున్నాయి. ఇలాగైతే ఎలా? అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులకు సమాధానం దొరకట్లేదు. ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఎన్నాళ్లు ఇలా ఇబ్బంది పడాలో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: