పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. మంచి నటుడు. ఆయన డైలాగులు బాగా చెబుతారు. ఎక్కడ పట్టి పట్టి చెప్పాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన డైలాగ్  డిక్షన్ అలాంటిది. విషయమేంటంటే పవన్ డైలాగులు సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే అదిరిపోతూంటాయి. సినిమాల్లో కంట్రోల్ చేసే డైరెక్టర్ కట్ చెబుతారేమో. ఇక్కడ ఆ బాధ లేదు. ఏంత సేపైనా చెప్పొచ్చు. ఎంత గట్టిగానైన బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. అది తన ఫ్యాన్స్ కి చేరితే చాలు. ఇదీ పవన్ మార్క్ స్ట్రాటజీ.


అందుకే పవన్ పొలిటికల్ సినిమా జనాలకు చేరువ కాలేకపోయింది. తప్పు ఎక్కడ ఉంతో దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది. కానీ పవన్ అలా చేయడంలేదని  విమర్శలు వస్తున్నాయి. పవన్ విశాఖ సిటీలోని గాజువాక నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అప్పట్లో ఒక మాట ఎన్నికల సభలో కచ్చితంగా చెప్పేవారు. తాన ఓడినా గెలిచినా గాజువాక జనం మధ్యనే ఉంటాను, మీ బాగోగులు చూసుకుంటాను, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాను అని. మరి పవన్ ఆ విధంగా చేశారా.


అంటే లేదు అని చెప్పాలి. పవన్ గాజువాక ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ మొదటి వారంలో వచ్చారు. ఆ తరువాత మళ్ళీ ఈ వైపు చూడలేదు. అంటే ఇది 11వ నెల నవంబర్. దాదాపు ఏడు నెలల వరకూ ఆయన విశాఖ ముఖం చూపించలేదు. పవన్ లాంటి వారు అనుకోవచ్చు. ఇందులో తప్పేముందని, కానీ ఇలాంటి చిన్న విషయాలే జనం గుర్తు పెట్టుకుంటారు.  రాజకీయాల్లో ఇవే అతి ముఖ్యం. మాట ఇచ్చినట్లుగా పవన్ విశాఖకు ఇప్పటికే వచ్చి ఉంటే ఇవాళ లాంగ్ మార్చ్ కి ఒక అర్ధం ఉండేది. కేవలం రాజకీయ ఉనికి కోసమే పవన్ విశాఖ వస్తున్నారు, ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆయన కనీసం గాజువాక ముఖం చూడలేదని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారంటే పవన్ అర్ధం చేసుకోవాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: