ఆంధ్రప్రదేశ్ ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి తీసికట్టుగా మారుతుందా...? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. కేంద్రంతో విభేదించడం కారణంగానే ఓడిపోయామనే ఆందోళన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇక ఇప్పుడు క్యాడర్ చెల్లాచెదురు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేసిన ప్రచారంగా అంతగా వ్యతిరేకత లేదనేది వాస్తవం.


గ్రౌండ్ లెవెల్ విషయాలకు దూరంగా ఉండే చంద్రబాబు ఈ విషయాన్ని గమనించడం లేదు.కేవలం ఇసుక గురించి మినహా ఆయన మరో సమస్య గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల దెబ్బకు పార్టీలో ఇప్పుడు ఆయనపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి నమ్ముకుని ఉన్న తమను ఏ మాత్రం పట్టించుకోలేదు అనే బాధ కొందరిలో వ్యక్తమవుతుంది.


సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగు తమ్ములల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఆయన శుక్రవారం వెళ్లి చినజీయర్ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ అసహనం పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయి. వల్లభనేని వంశీ మోహన్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి లాంటి మాస్ లీడర్లు పార్టీని వీడే అవకాశాలు కనపడుతున్నాయి. కరణం బలరాం కోసం బిజెపి సిద్దంగా ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది అర్ధం కాని పరిస్థితి.


ఆయన నవ్వుతూ ప్రసంగాలు చేస్తున్నా నేతల్లో మాత్రం పార్టీ భవిష్యత్తు ఏంటి అనే అనుమానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇన్నాళ్ళు ఎన్ని అవమానాలు భారించినా నిలబడిన నేతలు ఇప్పుడు పార్టీకే భవిష్యత్తు ఉండదు అనే ఆందోళనతో పార్టీని వీడటానికి సిద్దమవుతున్నారట. దీనికి కారణం చంద్రబాబు ద్వంద్వ వైఖరే అంటున్నాయి పార్టీ వర్గాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: