తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ కవిత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో బిజీ కానున్నార‌ట‌. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాల‌యిన ఆమె అనంత‌రం పెద్ద‌గా పార్టీ కార్యక్ర‌మాల్లో కానీ...నియోజ‌క‌వ‌ర్గంలో కానీ చురుగ్గా ప‌నిచేసిన దాఖ‌లాలు త‌క్కువ‌. అలా గ‌త కొద్దికాలంగా స్త‌బ్ధుగా ఉన్న గులాబీ ద‌ళ‌ప‌తి త‌న‌య‌...మున్సిపల్‌ ఎన్నికల నేప‌థ్యంలో...తిరిగి యాక్టివ్ అయ్యార‌ని స‌మాచారం. పుర‌పాలిక‌ల‌కు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ క‌విత ఆధ్వర్యంలో పలు దఫాలు చర్చలు జరిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


టీఆర్ఎస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, మున్సిపల్‌ ఎన్నికలపై అధికార పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు హైదరాబాద్‌లో చర్చించారు. పలు దఫాలు సమావేశాలను నిర్వహించారు. మాజీ ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొని మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విధంగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సి పాలిటీలపైనా వీరు చర్చించారు. రిజర్వేషన్‌ లు ప్రకటించి నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే రంగంలోకి దిగే విధంగా ఈ చర్చలను జరిపారు. 


మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరిగిన పలు సమావేశాల్లో మొత్తం మున్సిపా లిటీల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అత్యధిక సీట్లను కైవశం చేసుకున్నందున మొత్తం మున్సిపాలిటీలను గెలిపించుకునే విధంగా చూడాలని సీఎం ఆదేశించడంతో వీరు తీవ్ర ప్రయత్నా లు కొనసాగిస్తున్నారు. అందుకు సన్నాహకంగా ముందస్తుగా నేతలు చర్చించి, మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని మున్సి పాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు లేరు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగనున్నాయి. మెజారిటీ 50 వార్డులు అర్బన్‌ ఎమ్మె ల్యే పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన పది వార్డులు రూరల్‌తోపాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి.


బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలు ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల పరిధిలోనే ఉన్నాయి. భీమ్‌ గల్‌ నుంచి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పరిధిలో ఉండగా, జగిత్యాల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. వీరి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీకి చెందిన ఎక్కువమంది నేతలు హైదరాబాద్‌కు తరలివెళుతూ, మాజీ ఎంపీ కవిత తోపాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్త, షకీల్‌ అమీర్‌, విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కలిసి వస్తున్నారు. వీరి తోపాటు మరికొంత మంది నేతలు పార్టీ కా ర్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: