23 సీట్లతో పార్టీ చరిత్రలోనే ఘోర ఓటమిని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నాయకులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది. బలమైన, నమ్మదగిన నాయకులు ఇప్పుడు పార్టీ మారేందుకు చూడటం చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారడంపై ఇప్పటికే ఒక స్పష్టత రాగా మరికొంత మంది నేతలు కూడా ఆయనతో పాటుగా క్యూ లో ఉన్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి, సొంత పార్టీలో ఉన్న ఇబ్బందులు మాత్రం అర్ధం కావడం లేదు.


చంద్రబాబు నాయకత్వం ఇక కాలం చెల్లిందని ఆయన ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకట్టే అవకాశం లేదనే భావన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. నలుగురు ఎంపీలు పార్టీ మారడంపై చంద్రబాబు కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్నారు. వారికి ప్రజాదరణ లేకపోయినా నమ్మదగిన నేతలుగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నమ్మదగిన నేతలుగా ఉన్న కొందరు గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వంటి వారు పార్టీ మారడానికి సిద్దమవుతున్నారట. పయ్యావుల కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.


ఇక గంటా కూడా బిజెపి నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. వారి గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రచారమే జరుగుతుంది. చంద్రబాబు ఇటీవల గంటాను పిలిచి మాట్లాడారని అంటున్నారు. ఆయన పార్టీ మారెందుకే మొగ్గు చూపారని వైసీపీ లేదా బిజెపిలోకి వెళ్తాను అని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. త్వరలోనే అన్నీ అనుకున్నట్టు జరిగితే వాళ్ళు పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాస్తో కూస్తో బలంగా ఉన్న అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు నమ్మిన నేతలు కొందరు జెండా వదిలేస్తున్నారట. గంటా, పయ్యావుల ఇద్దరూ చంద్రబాబుకి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: