ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత విషయంలో తెలుగుదేశం పార్టీ దూకుడుగా వెళ్తుంది. వర్షా కాలంలో పనులు ఉండవు అనే సంగతి మరి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి తెలుసో లేదో గాని ఇసుక మీద జనసేన తో కలిసి ఉద్యమాలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. రాజకీయంగా బలహీన౦గా ఉన్న సమయంలో ఇసుక అనే దానిని ప్రధానంగా చేసుకుని అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తు ప్రజల్లో ఒక భ్రమను కల్పించడానికి అయన సిద్దపడుతున్నారు. ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తున్నారు.


జనసేన పార్టీ నిర్వహించే లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడమే ఒక విడ్డూరం అయితే... దానికి నేతలను పంపించాలని చంద్రబాబు భావించడం మరో విడ్డూరం. ఇక ఇప్పుడు నేతల్లో కూడా చంద్రబాబు మీద అసహనం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో ఇసుక మినహా మరొక సమస్య లేదా అనే అభిప్రాయం వారిలో ఎక్కువగా వినపడుతుంది. పార్టీ సీనియర్ల అభిప్రాయమే గాని తమ అభిప్రాయం చంద్రబాబు తీసుకోవడం లేదని ఇసుక సమస్య అనేది అంత తీవ్రంగా ఏమీ లేదని ధర ఎక్కువగా ఉండవచ్చు ఏమో గాని ప్రచారం చేసే కొరత లేదని,


కొన్ని కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటే ఇప్పుడు ఫ్రీ గా ఇసుక దొరుకుతుందని అంటున్నారు సొంత పార్టీ నేతలే. అసలు సమస్యలు ఏమీ లేనట్టు ఇసుకను పట్టుకుని చంద్రబాబు వేలాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని, దానికి తోడు జనసేనకు సహకరించడం కార్యకర్తల్లో అసహనానికి దారి తీస్తుందని సొంత పార్టీ నేతలు బాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇసుకను పక్కన పెట్టి పార్టీ నిర్మాణం చూడాలని, ఇసుక కాకుండా అనేక సమస్యలు ఉన్నాయని దానిని పట్టుకుని వేలాడటం మానేసి ఇతర సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: