యుటర్న్ చంద్రబాబు... వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళను లక్ష్యంగా చేసుకుని... ఎక్కువగా చేసుకునే విమర్శ. ప్రత్యేక హోదా విషయంలో, ఎన్డియేతో స్నేహం విషయంలో, కొన్ని నిర్ణయాల్లో ఆయన అనుసరించే వైఖరిని లక్ష్యంగా చేసుకుని కొందరు చంద్రబాబుని ఆ విమర్శ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మళ్ళీ చంద్రబాబు స్నేహం చెయ్యాలని భావించడం చూస్తుంటే ఆ మాట వాళ్ళు ఎందుకు అంటారో స్పష్టంగా అర్ధమవుతుంది. అవును ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు యుటర్న్ తీసుకున్నారు.


ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు డ్రామా ఆడించారనే ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలే అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. పవన్... చంద్రబాబు లక్ష్యంగా అప్పుడు నానా విమర్శలు చేసారు. ఇప్పుడు అలాంటి పవన్ నే మళ్ళీ చంద్రబాబు దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. జగన్ ని ఎదుర్కోలేని చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపి వైసీపీ నేతల లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయిస్తున్నారు.


విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ కి పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రులను తన సన్నిహిత నేతలను పంపించారు. దీనిపై తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. అసలు ఒక మాట మీద చంద్రబాబు ఉండరా అంటూ వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో కలిసి తమను పోరాటం చేయమని చెప్తే తాము అన్నీ మర్చిపోయి చెయ్యాలా అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ మహానటుడు అని... అలాంటి నటుడుని డైరెక్ట్ చేస్తున్న చంద్రబాబు గొప్ప దర్శకుడు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మ‌రి ఈ విష‌యంలో బాబు త‌న తీరు మార్చుకుంటారా ?  ఇంతేనా ? అని స‌ర్దుకుంటారా ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: