వైసీపీలోకి వెళ్తే తాను 152 అదే జనసేనలో ఉంటే తాను నెంబర్ 1. నేను అలాగే ఉంటాను గాని జెండా మార్చేది లేదు పార్టీ మారేది లేదని స్పష్టం చేసారు. తన కోసం ఏ ప్రయత్నాలు చేయవద్దని అప్పుడు తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు ఆయన స్పష్టంగా వివరించారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎటు కాకుండా అలా ఉండిపోయారు. పేరుకే శాసన సభ్యుడు గాని తన నియోజకవర్గంలోనే తన మాట చెల్లడం లేదు. కనీసం కానిస్టేబుల్ కూడా ఆయన మాట వినడం లేదనే ఆవేదన ఆయనలో ఎక్కువగా ఉంది. ఇటీవల పోలీసులు ఆయన విషయంలో అనుసరించిన తీరే దీనికి ఉదాహరణ.


ఎమ్మెల్యే అయినా సరే తన నియోజకవర్గంలో జరిగే ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా ఆయన పేరు ఉండటం లేదట. నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావే ఎమ్మెల్యేగా అన్నీ చేలాయిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ మరో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. విదేశాల్లో ఉంటున్న తన సన్నిహితులు, కొందరి పేర్లతో దొంగ ఓట్లు వేయించి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారని హైకోర్టులో బొంతు రాజేశ్వరరావు పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై కోర్ట్ స్పందించడమే కాదు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని విచారణకు కూడా పంపినట్టు సమాచారం.


ఇక తనతో సన్నిహితంగా ఉండే మంత్రి పినిపే విశ్వరూప్ కి రాపాక పరిస్థితిని వివరించారు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కనీసం ఆయనకు భద్రత కూడా కరువై౦దనే అభిప్రాయాలు నియోజకవర్గ౦లో వినపడుతున్నాయి. ఎవరైనా ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళడం మానేసి బొంతు దగ్గరకు వెళ్ళారు.  తొలిసారి అసెంబ్లీకి జనసేన ఎమ్మెల్యే వెళ్ళారు అనే సంతోషం కూడా ఇప్పుడు జనసైనికుల్లో లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి తాడు లేని బొంగరంలా మారిందనే ఆవేదన జనసేన స్థానిక నేతల్లో వ్యక్తమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: