జ‌న‌సేన లాంగ్‌మార్చ్‌తో  ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేయ‌బోయి ప‌వ‌న్ క‌ళ్యాణే కార్న‌ర్ అయ్యారా..?  ఇసుక కొర‌త‌తో భ‌వ‌న నిర్మాణ కార్మికులు రోడ్డున ప‌డ్డార‌ని, వారికి అండ‌గా ఉండేందుకు చేప‌ట్టిన లాంగ్‌మార్చ్‌తో ప‌వ‌న్ త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించిన‌ట్లేనా..?  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయ‌బోయి.. తానే అడ్డంగా బుక్ అయ్యారా..?  మ‌రోమారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెప్ప్‌గోల్ చేసుకుని గోతిలో ప‌డ్డ‌ట్లేనా..?  అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను మాట్లాడిన తీరు చూస్తుంటే నిజ‌మేనిపిస్తుంది. ఆవేశంతో   ప్ర‌సంగించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనాలోచితంగా నోరు జారిన‌ట్లు క‌నిపిస్తుంది.


క్ష‌ణికావేశంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటారో.. ఏమి మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చేసిన విశ్లేష‌ణ‌లను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌భ‌తో నిజం చేశారు. విశాఖ లాంగ్‌మార్చ్ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగంలో  తాను ఇలా మాట్లాడి అడ్డంగా బుక్ అయిన‌ట్లే లెక్క‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.  సీఎం జగన్ అద్భుతంగా పాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్ర‌క‌టించారు. అంటే రాబోవు రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టిస్తార‌నే పుకార్లు సోష‌ల్‌మీడియాలో వినిపిస్తున్నాయి.


ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పింక్ అనే రీమేక్ చిత్రంలో న‌టిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వ‌స్తుంద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతున్న త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోవు రోజుల్లో సినిమాల్లో న‌టిస్తే సీఎం జ‌గ‌న్ అధికారం బాగానే చేస్తున్న‌ట్లు లెక్క‌. సీఎం జ‌గ‌న్ పరిపాల‌న బాగా లేకుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోనే కొసాగుతార‌న్న మాట‌. మ‌రి సినిమాల్లో న‌టిస్తే ప‌రిపాల‌న బాగున్న‌ట్లే.


మ‌రి తాను సినిమాల్లో న‌టిస్తాన‌ని తెలిసి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడారో అంతుచిక్క‌కుండా ఉంది. అస‌లు రాజ‌కీయాలు ఇష్టం లేక‌  సినిమాల్లోకి వెళ్ళేందుకు, రాజ‌కీయాల‌కు దూరం అయ్యేందుకు, జ‌గ‌న్ ప‌రిపాల‌న బాగానే ఉంద‌ని చెప్పేందుకే ఈ స‌భ‌ను ప‌వ‌న్  క‌ళ్యాణ్ ఉప‌యోగించుకున్నారా..?  లేక అనాలోచితంగా నోరు జారారా అనేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టించేదాన్ని బ‌ట్టి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: