ఒక రాష్ట్ర గుర్తింపు ఆ రాష్ట్ర రాజధానితో ముడిపడి ఉంటుంది. అన్నీ రాజకీయ కలాపాలకు అది కేంద్రం. అలాంటి నూతన రాజధానిలో  శాసనసభ, సచివాలయం, హైకోర్ట్, రాజ్ భవన్ ఇలా ఎన్నో అధికారిక భవనాలు  ఉంటాయి. ఆ నిర్మాణాలే రాజధానికి  గుర్తింపు,  వాటి నిర్మాణం పూర్తైనట్లు కేంద్రం ఇచ్చిన నిధులతో  శాశ్విత నిర్మాణాలకు పూర్తిగా వినియోగించి నిర్మించినట్లు  "వినియోగ ధృవపత్రం" సమర్పించటం ద్వారా అధికారికంగా అర్ధమౌతుంది. ఇది అధికార గణాంకాల సాంప్రదాయం. అయితే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అలా  జరగలేదంటున్నారు రాష్ట్ర బిజేపి అధినేత కన్నా లక్ష్మీ నారాయణ.

Image result for new political map of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> 2019

కేంద్రం విడుదల చేసిన ఇండియా కొత్త "పొలిటికల్ మ్యాప్‌" లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేకపోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. పొలిటికల్ మ్యాప్‌ లో అసలు అమరావతి పేరే లేకపోడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధినేత కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కారణమన్న ఆయన, దేశ చిత్ర పటంలో రాష్ట్ర రాజధాని చిరునామా లేకుండా చేసి తీరని ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను ఐదేళ్ల పాటు రాజధాని పేరుతో మోసం చేశారని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.


"మోసం నీ సహజ గుణమని నిరూపించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను ఐదేళ్ళు రాజధాని పేరుతో మోసం చేసి, కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి, ఆఖరికి దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చిరునామా లేకుండా చేసి తీరని ద్రోహం చేశారు"  అని కన్నా లక్ష్మీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.


జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం ఇటీవల "భారత దేశ రాజకీయ చిత్ర పటం" ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌ లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరు లేకపోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు.

కారణాలు అనేకం కావచ్చని అంటున్నారు 

*ఏ అధికార భవనం నిర్మించబడక పోవటం,
*అన్నీ తాత్కాలిక నిర్మాణాలు కావటం,
*మరొక విషయమేమంటే రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన నిధులకు లెక్కలు చెప్పక పోవటం,
*నిధుల వినియోగ ధృవపత్రం సమర్పించకపోవటం 
*రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని పదేళ్ళ పాటు హైదరాబాద్ కొనసాగాలని నిర్ణయించటం 
*రాష్ట్రం నుండి సర్వే ఆఫ్ ఇండియాకు అధికారిక సమాచారం ఉండక పోవటం .... కావచ్చని అంటున్నారు.

భారత దేశ రాజకీయ చిత్ర పటంలో ఆంధ్ర ప్రదేశ్  రాజధాని పేరు లేకపోవడం చూసిన తెలుగు ప్రజలు తీవ్రమైన షాక్‌ కు గురవతున్నారు.  

Political map of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> showing States and its capitals (in red).

మరింత సమాచారం తెలుసుకోండి: