జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ- జనసేన దోస్తీపై సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసైపోతున్నందు వల్ల కొత్త ఐడియాలు ఇస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శిస్తూ...పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఉన్నారని ఆరోపించారు.


పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్‌లోకి వెళ్లిపోయాడని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌లు కలిసి తెరవెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పడు బహిరంగంగా కలిసి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. చంద్ర బాబు తనయుడు లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్‌ లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు.


అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ లనలో ఆ పార్టీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే స్పందించని పవన్‌.. ఇప్పుడు రోడ్డెక్కడం ఎందుకని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూటిగా ప్రశ్నించారు.


జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసేది లాంగ్‌ మార్చ్‌ కాదని.. అది రాంగ్‌ మార్చ్‌ అని విమర్శించారు. జనసేన లాంగ్ మార్చ్ కు ముందు గుంటూరు లో నారా లోకేశ్ కూడా దీక్ష చేశారు. ఒక్క రోజు దీక్ష పేరుతో హడావిడి చేశారు. అది పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. పవన్ సమస్య పరిష్కారానికి 2 వారాలు డెడ్ లైన్ ఇస్తూ ప్రకటన చేశారు.


అయితే నదులన్నీ నీటితో నిండి ఉండటం వల్లే ఇసుక తీయలేకపోతున్నామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. నదులు నీటితో నిండి ఉన్నప్పుడు ఇసుక తీసే టెక్నాలజీ ఉంటే ఏమైనా చెప్పాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను వారు కోరుతున్నారు. కేవలం ఇది రాజకీయాల కోసం చేసిన దీక్షలు, లాంగ్ మార్చ్ లు తప్ప ప్రజల కోసం కాదని వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: