లాంగ్ మార్చ్ పేరిట పదిహేను రోజుల నుంచి హడావుడి చేసిన జనసేనాని  చివరికి కారు మార్చ్ తో సరిపెట్టారని విమర్శలు  విపరీతంగా వస్తున్నాయి. విశాఖలోని మద్దిలపాలెం నుంచి  జీవీఎం సీ వరకూ కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కార్మికులతో కలసి పవన్ కళ్యాణ్ నడుస్తారని మొదట చెప్పారు. చివరికి పవన్  కారు ఎక్కించేశారు. ఆయన సైతం చేతులు వూపుకుంటూ జనాలతో కలసి వేదిక దాకా వచ్చేశారు. అచ్చం సినిమాటిక్ గా సాగిన ఈ ఫీట్ ని చూసిన వారు ఇదే లాంగ్ మార్చ్ అనుకోవాల్సివచ్చింది.


ఇక పవన్ లాంగ్ మార్చ్ లో అన్నీ సినీ పోకడలే. జనాలను బాగానే పోగు చేశారు. దానికి తోడు అభిమానులు ఎటూ ఉన్నారు. ఇలా  జనసేనానిని  పవన్ భారీ సందోహం మధ్య నుంచి వచ్చే  మాస్ నాయకుడిగా తీసుకువచ్చారు. దీంతో అసలు కార్యక్రమం పక్కకు పోయింది. తెలుగు తల్లి విగ్రహానికి పూల మాల వేసి పవన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడనుకున్నా ఆ వైపుగా జనసేనాని తొంగి చూడలేదు. మరో వైపు భవన నిర్మాణా కార్మికులు లక్ష మందితో లాంగ్ మార్చ్ అని చెప్పారు. కానీ భవన నిర్మాణ కార్మికులు కొద్దో గొప్పో వేదిక వద్దే  ఉంచారు.


పవన్ అభిమానులు, ఆ పార్టీ నాయకులు సేకరించిన జనంతోనే కార్ మార్చ్ చేశారు. దీని మీద వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాధ్ గట్టిగానే విమర్శలు చేశారు. లాంగ్ మార్చ్ అంటే అర్ధం తెలుసా పవన్ అంటూ ఎద్దేవా చేశారు. సేనాని కారులో, సైన్యం నడచి రావాలా. కనీసం రెండున్నర కిలో మీటర్లు కూడా నడవలేరా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పూర్తిగా బాబు ట్రాప్ లో పడిపోయారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. మొత్తానికి లాంగ్ మార్చ్ పేరిట పవన్ ముసుగు తొలగించేశారని కూడా వారు ఘాటుగా తగులుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: