జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనంతట తానుగా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇరుక్కుపోయారా ? లాంగ్ మార్చ్ లో పవన్ ప్రసంగం విన్నవారికి ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపు తాను జగన్ చేతిలో ఇరుక్కుపోవటమే కాకుండా తనను నమ్ముకుని వచ్చిన టిడిపి నేతలు, ఇతరులను కూడా దెబ్బ కొట్టేశారు.

 

లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో మాట్లాడుతు  జగన్మోహన్ రెడ్డి గనుక అద్భుతపాలన అందిస్తే తాను రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటానని ఆవేశంగా ఊగిపోతు  ప్రకటించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు డైరెక్టరతో కథా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. పార్టీ నడపటానికి డబ్బుల కోసమే తాను మళ్ళీ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవనే చెప్పారు.

 

అంటే తొందరలో జనసేనను గాలికొదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోతున్నట్లు అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే జగన్ అద్భుతపాలన అందిస్తే తాను రాజకీయాలను వదిలేసి సినిమాల్లోకి వెళిపోతాననే ప్రకటన ఎందుకు చేసినట్లు ? పవన్ గనుక సినిమాలు మొదలుపెడితే జగన్ అద్భుతపాలన అందిస్తున్నట్లే అనుకోవాలి. అలా కాకపోతే పార్టిని నడపటం కోసమే మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నట్లు చెప్పిందైనా తప్పని ఒప్పుకోవాలి.

 

పవన్ ప్రకటన చేసినపుడు టిడిపి తరపున ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణతో పాటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు కూడా వేదిక మీదే ఉండటం గమనార్హం. పవన్ ప్రకటన దెబ్బకు వీళ్ళ బుర్ర గిర్రున తిరిగినట్లే అయింది.

 

అదే సమయంలో తనను నమ్ముకుంటే అంతే సంగతులని పవన్  మరోసారి రుజువు చేశారు.  విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ అదే విషయాన్ని స్పష్టం చేసింది. భవన నిర్మాణ కార్మికులతో కలిసి సుమారు 10 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేస్తానని పవనే గతంలో ప్రకటించారు. తీరా జరిగిందేమిటంటే ఓ 2 కిలోమీటర్ల దూరాన్ని కారులో ఎక్కి ఊరేగింపుగా వేదిక దగ్గరకు చేరుకున్నారు. దాంతో లాంగ్ మార్చ్ కాస్త వైసిపి నేతలు చెబుతున్నట్లు రాంగ్ మార్చ్ అయిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: