విశాఖ‌లో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్ సంద‌ర్భంగా...ఇసుక స‌మ‌స్య‌పై స్పందించ‌డంతో పాటుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నేత‌లు సైతం అదే రీతిలో స్పందిస్తున్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి,సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి...ప‌వ‌న్ తీరుపై మండిప‌డ్డారు. ``విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేశారు. రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు.అది టివిలలో చూశాం. ఈ మార్చ్‌లో ఎక్క‌డా భవన నిర్మాణ కార్మికులు కనిపించలేదు. అందులో జనసేన జెండాలు పట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారు.` అని వ్యాఖ్యానించారు. 


ఢిల్లీలో ఉండే నేతలతో త‌మకు సంబంధాలు ఉన్నాయని ప‌వ‌న్ చెప్ప‌డంపై అంబ‌టి ఘాటుగా స్పందించారు. `ఢిల్లీలో పలుకుబడి ఉంది అంటారు. పలుకుబడి ఉంటే రాష్ర్ట అభివృధ్దికి కృషి చేయండి. ఓ పక్క బీజేపీతో సంబంధాలు నెరుపుతూనే వామపక్షాలతో మాట్లాడుతుంటారు.వారితో కలసి పోటీచేస్తారు. ఇది మీ విధానం`` అని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో విమర్శలు చేయండి అవి సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదు. రాజకీయంగా వంద విమర్శలు చేసినా వాటికి సమాధానం చెబుతామ‌ని అయితే..వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని అంబ‌టి రాంబాబు అన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ``ఈ రాష్ర్టానికి మంత్రిగా ఉన్న కన్నబాబును ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారా? కన్నబాబు కథ‌ అంతా తెలుసంటారా.. ఏం తెలుసు మీకు? క‌న్న‌బాబు గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు.కన్నబాబును గెలిపించారు. కన్నబాబు మీ పార్టీలో ఉండి ఉండవచ్చు. మీ అన్నగారి పార్టీలో  టిక్కెట్టు ఇచ్చి ఉండవచ్చు. అందులో 18 మంది గెలిస్తే వారిలో కన్నబాబు ఒకరు. కన్నబాబుపై మీకు హక్కు లేదు.`` అని స్ప‌ష్టం చేశారు. 
రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిగారి గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదుని అంబ‌టి రాంబాబు అన్నారు. 


``విజయసాయిరెడ్డి గురించి మీరు మాట్లాడారు. రెండున్నరేళ్లు జైలులో ఉన్నారని , వారికి మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని, జగన్ కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని అన్నారు. ఇవన్నీ మీ మాటలు కాదు. అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు స్ర్కిప్ట్ తీసుకువస్తే చదివే దౌర్భాగ్య పరిస్ధితి. -ఇంతకుముందు టీడీపీ వాళ్లు కూడా ఇదే మాట‌ అన్నారు. వారందరికి తెలియచేస్తున్నా. జగన్ కేవలం నేరారోపణ చేయబడ్డ వ్యక్తి మాత్ర‌మే. 16 జైలులో ఉన్నవ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి ..ఇలాంటివన్నీ తెలిసే ప్రజలు ఎన్నికలలో 151 సీట్లలో గెలిపించారు.`` అని ఆయ‌న వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: