ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై, మంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్యసభ, గవర్నర్‌ పదవుల పేరుతో టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు తనను మోసం చేశాడని ఆయనపై తిరుగుబాటు జెండాను ఎగురవేసిన మోత్కుప‌ల్లి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అనంత‌రం చంద్ర‌బాబు ఓట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేశారు. చంద్ర‌బాబు ఓడితేనే..ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఇటీవ‌ల‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓట‌మి పాల‌యిన సంగ‌తి తెలిసిందే. ఇలా పొలిటిక‌ల్ కెరీర్ అయోమ‌యంలో ప‌డిన మోత్కుపల్లి నరసింహులు బీజేపీ కండువా క‌ప్పుకొంటున్నారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇటీవ‌ల న‌ర్సింహులు ఇంటికి వెళ్లారు. మోత్కుపల్లిని బీజేపీలోకి ఆహ్వానించడంపై రెండు గంటల పాటు కిషన్ రెడ్డి , లక్ష్మణ్  సుదీర్ఘ చర్చలు జరిపారు. సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి... బీజేపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న పార్టీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం జ‌రిగిన‌ప్ప‌టికీ..ఆ టూర్ లేక‌పోవ‌డంతో వాయిదా ప‌డింది. దీంతో ఢిల్లీకి చేరిన మోత్కుప‌ల్లి...అక్క‌డ కండువా క‌ప్పుకోనున్నారు. 


ఇటీవ‌ల ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయ‌గా ఓట‌మి పాల‌యిన మోత్కుపల్లి నరసింహులుకు కాషాయ కండువా క‌ప్ప‌డం వెనుక పార్టీకి బ‌ల‌మైన ద‌ళిత నాయ‌కుడి అండ తీసుకురావ‌డ‌మేన‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే విరుచుకుప‌డే నేత‌గా పేరున్న మోత్కుప‌ల్లి...బీజేపీ కండువా వేసుకున్న అనంత‌రం పార్టీకి వివిధ వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో విజ‌య‌వంతం అవుతార‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. బీజేపీ నేత‌ల ఆశ‌లు...మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సెకండ్ ఇన్నింగ్స్ విజ‌య‌వంతం అవ‌డం తెలియాలంటే..మ‌రికొద్ది కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: