మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలోని ప్రజారాజ్యం పార్టీని నాశ‌నం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జ‌న‌సేన‌ను అదే విధంగా చేయాల‌ని చూస్తోంద‌ని...మెగా అభిమానులు భావిస్తున్నార‌ని...మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత‌ ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు.  జనసేన లాంగ్ మార్చ్ కు భవననిర్మాణ కార్మికులు కొద్దిమంది వచ్చారని, అయితే అభిమానులు బాగా వచ్చారని వెల్ల‌డించారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీ గురించి ఎప్పుడూ ప్ర‌శ్నించ‌ని ప‌వ‌న్ ఇప్పుడు స్పందిస్తున్నార‌ని వారు బాధ‌ప‌డ్డార‌ని తెలిపారు. నాగావళి ఇసుకను అచ్చెన్నాయుడు దోచుకున్నాడని..ఆయ‌న్ను వేదిక‌పై కూర్చోపెట్టుకున్నార‌ని అభిమానులు గ్ర‌హించార‌ని ఆమంచి పేర్కొన్నారు. 


ఉండ‌వ‌ల్లి నిర్మాణంపై ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌ను ఆమంచి త‌ప్పుప‌ట్టారు. `లాంగ్‌మార్చ్ స‌భ‌లో రెండోసారి నాదెండ్ల మనోహర్ మాట్లాడతాడని అధ్యక్షత వహించిన వ్యక్తి ప్రకటించగానే పవన్ అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. నాదెండ్ల మనోహర్ లింగమనేనికి బంధువు.లింగమనేని చంద్రబాబుకు బంధువు. అలాంటి నాదెండ్ల మనోహర్ స్క్రిప్ట్ రాసిస్తే రాష్ర్టంలో ఏ సమస్యా లేనట్లు లింగమనేని స్దలంలో నిర్మించిన ప్రజావేదికను ప్రస్తావిస్తావా ప‌వ‌న్‌? చంద్రబాబువి అనేక అక్రమ సామ్రాజ్యాలు ఉన్నాయి. అవి కూల్చాల్సిందే.` అని వెల్ల‌డించారు.


భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణాలలో 90 శాతం వాటా చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లదే ఉందని ఆమంచి ఆరోపించారు. `చంద్రబాబు హయాంలో భవన నిర్మాణకార్మికుల నిధులను డైవర్ట్ చేశారు.అప్పటి కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడును పక్కనపెట్టుకుని అసంభధ్దమైన డిమాండ్లు పెట్టారు. గత పదిసంవత్సరాల పూర్వం వరదలు వచ్చినప్పుడు సహజంగా పనులు దొరకవు.ఎందుకు దొరకవంటే ఒక్కో సీజన్ లో వారికి అలా ఉంటుంది. ఆ ఇబ్బందులను ప్లాన్ చేసుకుని ప్రభుత్వసహకారంతోగాని,వారి క్షేమం కోరే వారి ద్వారా కానీ అధిగమిస్తారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ హడావుడి వల్ల భవన నిర్మాణకార్మికులు నైరాశ్యంలో పడిపోయారు. మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్దితిని వారు కల్పించారు. ` అని మండిప‌డ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: