నాలుగు నెలల క్రితం అనుకుంట... పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చి... అమరావతి విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అనకుండా... ప్రధాని మోడికి, అమిత్ షా కు ఫిర్యాదు చేస్తాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పలు మార్లు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారాయన. కట్ చేస్తే... విశాఖలో జనసేన ఇసుక కొరత వలన నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా భారి ఎత్తున లాంగ్ మార్చ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి వామపక్షాలు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు.


కాని టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తన పార్టీ సీనియర్ నేతలను ఈ కార్యక్రమానికి పంపించారు. మరో నేతను వెళ్ళమని చెప్పినా ఆయన వెళ్ళలేదు. ఇక మార్చ్ కి ముందు అధికార పార్టీ నేతలు పవన్ ని ఉద్దేశించి చంద్రబాబు దత్త పుత్రుడని విమర్శలు చేసారు. అసలు వాళ్ళు ఆ వ్యాఖ్య ఎందుకు చేసారు అనేది ఆలోచిస్తే కొన్ని కొన్ని అర్ధమవుతూ ఉంటాయి... ఇప్పుడు జనసేనను బిజెపిలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఒప్పించి లాంగ్ మార్చ్ నిర్వహించి,


భారీ స్థాయిలో జనసమీకరణ చేసి... లాంగ్ మార్చ్ విజయవంతం అయింది కాబట్టి జనసేనకు ఉన్న బలం ఇది, పవన్ కి ఉన్న క్రేజ్ ఇది అనే సంకేతాలను చంద్రబాబు పంపించారు. ఇక గంటా శ్రీనివాసరావుని ఇప్పటికే ఢిల్లీ పంపించి కాపు నేతలను బిజెపిలోకి పంపేందుకు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారు చంద్రబాబు. అందుకే ఇప్పుడు హడావుడి గా సినిమాల మీద దృష్టి పెట్టిన పవన్ తో భవిష్యత్తులో కాళీ ఉండదు ఏమో అని ఆలోచించి... హడావుడిగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. అందుకే వైసీపీ నేతలు వ్యాఖ్యానించినట్టు పవన్ దత్తపుత్రుడు చంద్రబాబుకి అంటున్నారు పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: