మంత్రి అనేవారు రాజ్యానికి, ప్రజల బాధను పూర్తిగా అర్థం చేసుకొనేవారు అయ్యి ఉండాలి.. అప్పుడే రాజ్యం బాగుంటుంది.. దేశం బాగుంటుంది.. ఇప్పుడు ఇక్కడ ఇలానే జరిగింది. అదేంటంటే.. ఓ మంత్రి మురికి కాలువ నీటిగా లేదని ఓ పార తీసుకొని గుంతలోకి దిగి అంతా శుభ్రం చేశారు. దోమలు రాకుండా ఇలా చేయాలంటూ హిత బోధ చేశారు. ఇంతకీ ఎవరు ఎంటి ఆ మ్యాటర్ అనే విషయం గురించి తెలుసుకుందాము..


ఇకపోతే ఆయన ఎవరంటే మధ్యప్రదేశ్​లో రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్.. మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు తానే నడుం బిగించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధుమన్​ సింగ్​ తోమర్.. గాల్వియర్​ నియోజకవర్గంలోని బిర్లానగర్​లో పరిశుభ్రత డ్రైవ్​ చేపట్టారు. స్థానిక 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది..


దాదాపు ఎనిమిది అడుగుల లోతునఉండే కాలువలో దాదాపుగా సంవత్సరం నుండి మురికిని తీసివేయక పోవడంతో మరింత ఎక్కువగా పేరుకుపోయి నీళ్ళు పోకుండా అడ్డుకుంటుంది . దానితో రంగంలోకి దిగిన మంత్రి ఆ పూడికను పూర్తిగా అందులో దిగి మరి తీసివేశారు.. అక్కడి ప్రజలు కూడా ఈ విషయంపై ఇబ్బంది పడటంతో ఈ విషయాన్ని మంత్రి ముందు పెట్టారు..


తన దృష్టికి రావడంతో స్పందించిన మంత్రి తానే స్వయంగా మురుగుకాలవలోకి దిగి చెత్త బయటకు వేశారు. దీంతో మంత్రిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ప్రైజ్ చేస్తున్నారు. ప్రధుమన్​ నియోజకవర్గం వ్యాప్తంగా 30 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు స్వచ్చతపై అవగాహాన కలిగించేందుకు ఆయన ఇలా చేశారు. ఇక మంత్రి బాగా చేసారు అంటూ అందరూ ఆయనకు జేజేలు..పలుకుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: