రోడ్డుమీద వాహనదారులు హార్న్  కొట్టడం కామన్ . చీటికిమాటికి హారం కొట్టుకొట్టె వాళ్ళు కొంత మంది ఉంటే...  ఇంకొంత మంది వాహనం  కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పదేపదే హార్న్  కొడుతుంటారు... ఇంకొంతమంది ఏదైనా వాహన అడ్డు  వచ్చినప్పుడు హార్న్  కొడుతుంటారు . కానీ ఇకనుంచి హార్న్  కొడితే  మాత్రం జేబుకు చిల్లు పడిపోతుంది. అందుకే హార్న్  కొట్టే ముందు మరోసారి ఆలోచించాల్సిందే. ఇకనుంచి  హార్న్ కొడితే జేబుకి  చిల్లు పడక  తప్పదు మరి. పోలీసులు సరికొత్త నిబంధనతో హార్న్  కొడితే ఫైన్ వేస్తున్నారు. 

 

 

 ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. హిమాచల్ ప్రదేశ్ లోని  రాజధాని సిమ్లా లో హార్న్  కొట్టడాన్ని నిషేధించాలని   అక్కడి పోలీసులు నిర్ణయించారు. దీనికోసం సరికొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు పోలీసులు. ఇక ఈ రోజు నుండి ఆ నిబంధన అమల్లోకి రానుంది. ఇక వాహన దారులు ఎవరైనా హార్న్  కొడితే ఫైన్ కట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్ లోని  ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన సిమ్లాలో స్థానికులు పర్యాటకులకు ఈ అంశంపై అవగాహన కల్పించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ఎవరైనా అనవసరంగా హార్న్  కొట్టినట్లు స్థానికులు కానీ పోలీసులు గాని భావిస్తే ఆ తర్వాత సదరు వ్యక్తి ఫైన్ కట్టక తప్పదు. 

 

 

 

ఈ క్రమంలో అనవసరంగా హార్న్ కొట్టొద్దంటూ  వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే గతేడాది ఆగస్టులో నే ఈ కార్యక్రమాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  జైరామ్ ఠాకూర్  ప్రారంభించారు. ఇక ఈ రోజు నుండి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కొత్త నిబంధన పై టూరిస్టులు స్థానికులతో పాటు స్కూల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పర్యావరణ సైన్స్ టెక్నాలజీ డైరెక్టర్ డీసీ రాణా  తెలిపారు. ఈ నిబంధనను అమల్లోకి వచ్చినప్పటి నుంచి వాహనదారులు ఎవరైన హార్న్ కొడితే  ఎక్కడ ఫైన్ పడుతుందోనని  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: