వైసీపీ ప్ర‌భుత్వం త‌న‌ను బెదిరింపుల‌కు గురిచేస్తోంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కంటే...ప్రభుత్వంలో భాగ‌మైన వారు ఎదురుదాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో లాంగ్ మార్చ్ నిర్వ‌హ‌ణ‌, దానిపై వైసీపీ పార్టీ స్పంద‌న నేప‌థ్యంలో..ప‌వ‌న్ క‌ళ్యాణ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.జ‌నసేన లాంగ్‌మార్చ్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయ‌న తెలిపారు. ఇందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతం చూస్తాన‌ని అన‌డం ఏంట‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 


 ప్రజలలో తీవ్రమైన ఆగ్రహం ఉన్నందునే నిన్నటి కార్యక్రమం అంత విజయవంతం అయ్యిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం లాంగ్ మార్చ్ అనంతరం సభను విజయవంతం చేసినందుకు విశాఖ జిల్లా జనసేన నాయకులనుపవన్ కళ్యాణ్ అభినందించారు. గత వారం రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరినీ మెచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సమస్యను గుర్తించడంలేదని...వ‌ర‌ద‌ల కార‌ణంగానే...ఇసుక కొర‌త అని పేర్కొన‌డం చిత్రంగా ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు, వరదలు వచ్చాయి..అక్కడ ఎందుకు భవన నిర్మాణ కార్మికులు చనిపోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యను వినకపోగా...నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిర్మాణ రంగాన్ని ఆపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.  అస్తవ్యస్థ పాలన సాగిస్తే చూస్తూ ఊరుకోమని, జగన్‌పై వ్యక్తిగత ద్వేషాలు లేవని పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రి క‌న్న‌బాబు ఒక‌ప్పుడు త‌న వెంట ఎలా తిరిగారో త‌న‌కు తెలుసున‌ని...అలాంటి వ్య‌క్తి త‌న‌పై చేస్తున్న వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌న్నారు.
మ‌రోవైపు, ఏపీ సీఎస్ బ‌దిలీపై సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఏవో తప్పులు జరిగినట్లే  అర్థమవుతోందన్నారు. రి కోరి తెచ్చుకున్న సీఎస్‌ ఎల్వీ సుబమణ్యంను తప్పించడం వెనుక కార‌ణం ఏంటో ప్ర‌భుత్వ‌మే చెప్పాల‌ని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: