జ‌న‌సేన పార్టీకి న‌కిలీల బెడ‌ద ఎక్కువైంది. గ‌త నెల‌లో ఓ చిత్ర‌మైన స‌మ‌స్య‌ను పార్టీ తాజా మ‌రో ఇబ్బందికి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించ తలపెట్టిన అంశాన్ని వెల్ల‌డించిన స‌మ‌యంలో...ఇందుకోసం నిధులు ఇవ్వాలంటూ..సోష‌ల్ మీడియాలో భారీ ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జ‌న‌సేన వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అలాంటి చ‌ర్య‌లు పార్టీ చేయ‌డం లేద‌ని తెలిపింది. తాజాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై సైతం అదే రీతిలో స్పందించారు


సామాజిక మాధ్యమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రణ దీక్ష పేరుతో జరుగుతున్న ప్రచారం అవాస్తవమ‌ని పార్టీ వెల్ల‌డించింది. ``తప్పుడు సమాచారంతో పార్టీ లెటర్ హెడ్ పై పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ సృష్టించారు. అసత్యమైన   ఆ ప్రెస్ నోట్‌ను ఎవరూ విశ్వసించవద్దు. ఈ తప్పుడు లేఖను సృష్టించి, ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ లీగల్ విభాగం సన్నద్ధమైంది.`` అని వెల్ల‌డించింది.


కాగా, జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ సభలో గాయపడిన పీలా మహేష్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారని పార్టీ తెలిపింది. విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని నాదెండ్ల మ‌నోహ‌ర్ సోమవారం రాత్రి పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మహేష్ కు, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. "మహేష్ త్వరగా కోలుకోవాలని పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  కోరుకున్నారు. పార్టీ అండగా ఉంటుంది" అని చెప్పారు. చోడవరం గ్రామానికి చెందిన మహేష్ ఫాల్స్ సీలింగ్ పనులు చేస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: