రాజకీయాల్లోకి వచ్చాక పవన్ మొదట్లో సినిమాలు అరకొరగా చేసినా కూడా తరువాత ఆయన పూర్తిగా రాజకీయానికే ఓటు వేశారు. 2018 నుంచి అంటే రెండేళ్ళ పాటు ఆయన ముఖానికి రంగు వేసుకోలేదు. రాజకీయాల్లో ఫుల్ టైమర్ అని పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన ఓ వైపు ఉంటే ఏపీలో మూడవ ఫోర్స్ గా రావాలని పవన్ ఆశ మరో వైపు కలసి సినిమాలకు పవన్ దూరం అయ్యారు. ఇపుడు చూస్తే ఫలితాలు వచ్చేశాయి. పవన్ ఏపీలో ఎమ్మెల్యే కూడా కాడు, ఆయన ఓ పార్టీ అధినేత మాత్రమే.


అందువల్ల ఆయన ఓ విధంగా ఇపుడు ఖాళీ. ఎలా అనుకున్న ఎన్నికలు మరో నాలుగున్నరేళ్ళ వరకూ రావు. ఈ లోగా పార్టీని ఓ కంట కనిపెడుతూనే పవన్ సినిమాలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇపుడు పవన్ నోటి వెంట కూడా సరిగా ఇదే రకమైన మాటలు వచ్చాయి. అయితే అవి అంత స్పష్టంగా లేవు కానీ ఆయన సినిమాలలో మళ్ళీ నటించే విషయంలో తొందరలోనే ప్రకటన చేసేలా  ఉన్నాయి.


రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరు తమ ఉపాధి వదులుకున్నారు. అవంతి శ్రీనివాస్ తన కాలేజీలు నడపడం మానుకున్నారా. ముఖ్యమంత్రి జగన్ కి భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్లు ఉన్నాయి. ఇంకా చాలా మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. నాకు తెలిసిందల్లా సినిమానే. నాకు మాత్రం ఎక్కడ నుండి డబ్బులు వస్తాయంటూ పవన్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అంటే పవన్ రేపటి రోజున కచ్చితంగా తిరిగి నటిస్తారన్న సంకేతాలు మాత్రం ఇచ్చేశారు. అయితే పవన్ తాను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను అంటున్నారు. నటనపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని కూడా చెబుతున్నారు మరి చూడాలి పవన్ కొత్త సినిమా ప్రకటన ఎపుడు వస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: