అదెంటో ఎపుడూ ముఖ్యమంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వివాదాలు సాగుతూ ఉంటాయి. సీఎంలు చెప్పినది చేస్తే ఒకే లేకపోతే వారికి వేటుపడుతుంది. చంద్రబాబు హయాంలోనూ సీఎస్ లతో ఎపుడూ గొడవలు ఉండేవని ప్రచారంలో ఉంది. అయితే జగన్ మాత్రం కాస్తా ముందడుగు వేసి హఠాత్తుగా బదిలీ చేశారు. ఇదే ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సరే ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చిందని అందుకే ఇలా చేశారని ప్రచారం ఓ వైపు ఉంది. అదెంతవరకూ నిజమో తెలియదు కానీ ఏపీకి కొత్త సీఎస్ ఎవరు...


అదే ఇపుడు పెద్ద చర్చ. అయితే కొత్త సీఎస్ ని జగన్ ఎంపిక చేసి పెట్టుకునే పాత సీఎస్ ని బదిలీ చేశారని అంటున్నారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల మానవ అభివ్రుధ్ధి విభాగానికి డీజీగా బదిలీ చేసిన సంగతి విధితమే. ఇక కొత్త సీఎస్ గా నీలం సాహ్నీని జగన్ ఎంపిక చేశారని అంటున్నారు. ముక్కుసూటి అధికారిగా పేరుపడిన నీలం సాహ్నీ 1984 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఏపీకి కొత్త సీఎస్ అవుతారని అంటున్నారు. ఆమె ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తరువాతనే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ  నిర్ణయం వెలువడిందని అంటున్నారు. సామాజిక న్యాయం, సాధికారిత విభాగాంలో ఆమె సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. 


ఇదిలా ఉండగా ఏపీలో జగన్ అనుకుంటున్న నిర్ణయాలు  వేగంగా అమలు అయ్యేందుకు ఎల్వీ సుబ్రమణ్యం సహకరించలేదని భావించారట. పైగా సెక్రటరీల వద్ద  ఫైళ్ళు  పెద్ద ఎత్తున  పెండింగు ఉండడం,   జీవో నంబర్ పడక ముందే తెలుగుదేశం పార్టీకి చేరిపోవడం, లీకేజ్ వ్యవహారాలు వంటి వాటి మీద జగన్ గుర్రుగా ఉన్నారట. దీని మీద ఎల్వీ సుబ్రమణ్యం కి చెప్పినా ఆయన పట్టించుకోకపోవడం వల్లనే చివరికి ఇలా చేశారని అంటున్నారు. ఇక టీడీపీకి కొత్త జీవోలు వెళ్ళకుండా లీకేజ్ ని అరికట్టడంతో పాటు పాలన వేగంగా సాగేలా  చూసేందుకే నీలంని కొత్త సీఎస్ గా జగన్ నియమిస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: