ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. నిన్న మొన్నటి వరకూ కాస్త కూల్ గా ఉన్న రాజకీయం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ విశాఖ రాంగ్ మార్చ్ తో మళ్లీ వేడెక్కింది. లాంగ్ మార్చ్ నేపథ్యంలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ చేపట్టిన తర్వాత ఇది ఇంకాస్త ఎక్కువైంది. లాంగ్ మార్చ్ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రులపై విరుచుకుపడ్డారు.


ప్రత్యేకించి కన్నబాబుపై పవన్ కల్యాణ్ నేరుగా విమర్శలు గుప్పించారు. అసలు కన్నబాబు రాజకీయాల్లోకి తెచ్చిందే మేము.. ఆయన ఇప్పుడు మాకే పాఠాలు చెబుతున్నారు అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలపై వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. పవన్‌ లాంగ్‌ మార్చ్‌ ఎందుకు చేశారో అర్థం కావడం లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు.


కన్నబాబును నాగబాబు గెలిపించారని పవన్‌ అంటున్నారని, మరి నాగబాబును పవన్‌ ఎందుకు గెలిపించుకోలేకపోయారని కొడాలి నాని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రెండు చోట్ల ఓడిపోయారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాగావళి నదిలో అచ్చెన్నాయుడు బకాసుడిలా ఇసుకను మింగేశారని కొడాలి నాని విమర్శించారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు రంగురాళ్లను దోచేశారని కొడాలి నాని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్‌ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారని కొడాలి నాని తెలిపారు.


వరదల్లో ఇసుక ఎలా తీస్తారో చెబుతారని ఎదురుచూశామని కొడాలి నాని పేర్కొన్నారు. పవన్‌ ఎవరో ఇచ్చిన స్రిప్ట్‌ను కూడా సరిగా చదవలేకపోయారన్నారు కొడాలి నాని  పవన్‌ వ్యాఖ్యలను చూసి జనం అసహ్యించుకుంటున్నారని కొడాలి నాని చెప్పారు. వైసీపీ నాయకులు వేస్తున్న ఈ ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: