వైసీపీ నేతగా ఎన్నో కేసులు ఎదుర్కొంటూ వస్తున్న  జగన్ 2014లో త్రుటిలో ముఖ్యమంత్రి అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అయినా క్యాబినెట్ ర్యాంక్ తో ప్రతిపక్ష‌ నేతగా ఎదిగారు. ఆ హోదా నుంచి ఇపుడు ముఖ్యమంత్రి హోదాకు వచ్చేశారు. అలా ఇలా కాదు బంపర్ మెజారిటీతో జగన్  అజేయమైన విజయం సాధించారు. అటువంటి జగన్ కి భయం అంటే ఏంటో తెలియదు అంటారు, మరి ఆయనలో అభద్రతాభవం ఎక్కడిది.


అయితే తొలిసారిగా ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ కి రాసిన లేఖలో మీలో అభద్రతాభావం పెరిగిపోతోందని రాయడం విశేషం. జగన్ ముఖ్యమంత్రి అయి అయిదు నెలలు మాత్రమే అయింది. ఆయన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేస్తోంది. మరి ప్రజల్లో పాజిటివ్ గా  భావన ఉంది. ఇసుక రాద్ధాంతం తప్ప ఇప్పటికిపుడు వచ్చిన పెద్ద సమస్యలు ఏమీ లేవు.


కానీ ముద్రగడ కనిపెట్టిన అభద్రతాభావం ఏంటో పెద్ద చర్చగానే ఉంది. జగన్ లో కంగారు కూడా ఎక్కువగా  ఉందని ఆయన అంటున్నారు. అయితే జగన్ నిదానంగానే ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఏ విషయంలో  అయినా  తొందరగా నిర్ణయం తీసుకుంటారు, అలాగని అది అనాలోచితంగా కాదు, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత దాని మీద ఎటువంటి ఫ‌లితం వచ్చినా కూడా స్టిక్ ఆన్ అయిపోతారు. 


మరి జగన్ లో అభద్రత ఎక్కడ. చూడాలి మరి జగన్ కి ఇప్పటికైతే ఏ వైపు నుంచి ఏ విధమైన రాజకీయ ముప్పూ ప్రమాదం లేదు, ఆయన ఏపీలో అన్ని రాజకీయ పార్టీల కంటే ఎంతో ఎత్తులో ఉన్నారు. కానీ ఇది రాజకీయం. ఒక్కో మెట్టు ఎక్కి అందలం ఎక్కినా ఒకేసారి జారిపడిపోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.


మరింత సమాచారం తెలుసుకోండి: