తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్యోదంతం తెలంగాణను బాగా కుదిపేసింది. సీఎం కేసీఆర్ సహా ప్రతి ఒక్కరూ ఈ అమానవీయ హత్యను ఖండించడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కౌలు రైతు సురేష్... ఆమె ఛాంబర్‌లో తలుపులు మూసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. తనకు భూమి పట్టా రాదనే ఉద్దేశంతో ఆమెను హత్య చేశారు అని తెలుస్తుంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్... తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు . ఈ సంఘటనలో మరో రైతుకూ, సురేష్‌ కూడా మంటలలో చిక్కుకున్నాడు.

విజయారెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది. అక్కడ విగతజీవిగా ఉన్న ఆమెను చూసి... కుటుంబ సభ్యులు కన్నీటితో మునిగి పోయారు. ఆమె భర్త సుభాష్‌ రెడ్డి, తల్లి వినోద, తండ్రి లింగారెడ్డి, పిల్లల్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఎల్బీనగర్‌లోని ఇంటికి  తరలించడం జరిగింది. ఇవాళ ఉదయం నాగోలులో అంత్యక్రియలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు.


ఇక తెలంగాణ ప్రభుత్వం బంద్‌కి పిలుపు : ఈ దారుణంపై భగ్గుమన్నాయి రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసి... నల్ల బ్యాడ్జీలు, కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందేనని డిమాండ్ కూడా చేయడం మొదలు పెట్టారు. ఇవాళ్టి నుంచీ మూడ్రోజులపాటూ... విధులు బహిష్కరిస్తున్నారు. అలాగే... నేడు తెలంగాణ బంద్ తెలియచేయడం జరిగింది. ఈ బంద్‌కి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా... జరిగిన ఘటనను ఖండిస్తూ... ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కి సహకరించే అవకాశం కూడా ఉంది. మూడు రోజులు విధుల బహిష్కరణ తర్వాత... ప్రభుత్వం నుంచీ తమకు స్పష్టమైన హామీ వస్తేనే తిరిగి విధులు ప్రారంభిస్తామని రెవెన్యూ అధికారులు తెలియచేసారు.


విజయారెడ్డి ప్రస్థానం గురించి తెలుసుకుందామా మరి తహసీల్దార్‌ విజయారెడ్డి సొంత ఊరు నల్గొండ జిల్లా... శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామం. రిటైర్ట్ టీచర్ లింగారెడ్డి దంపతుల రెండో కూతురు ఆమె. నల్గొండలో డిగ్రీ చేసిన ఆమెకు... 13 ఏళ్ల కిందట సుభా‌ష్ రెడ్డితో వివాహం జరిగింది. వాళ్లకు కూతురు చైత్ర(11), కొడుకు అభినవ్‌(7) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుభాష్ రెడ్డి... హయత్‌నగర్‌ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయారెడ్డి 2004లో ప్రభుత్వ టీచర్‌గా ఎంపిక అవ్వడం జరిగింది. కానీ 2009లో గ్రూప్‌-2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌ అయ్యారు. 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి తహసీల్దార్‌గా ప్రమోషన్‌పై రావడం జరిగింది. అలాంటి ఆమెను హత్య చేయడంతో... ప్రతి ఒక్కరూ కూడా  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: